శివరాత్రికి, కందగడ్డకు సంబంధం ఏమిటో తెలుసా?

మహాశివరాత్రి వచ్చిందంటే చాలు మార్కెట్లో కంద గడ్డలువిరివిగా లభిస్తాయి.శివరాత్రికి ఎంతో ప్రత్యేకంగా ఈ కంద గడ్డలు ఉంటాయని చెప్పవచ్చు.

 Do You Know What Is The Connection Between Shivaratri And Kandagarda-TeluguStop.com

సంవత్సరం మొత్తంలో ఈ కంద గడ్డలు శివరాత్రికి మాత్రమే లభించడం ఎంతో విశేషం.ఈ గడ్డలను తెలంగాణలో కందగడ్డ అని ఆంధ్రాలో చిలగడదుంపలుగా పిలుస్తారు.

శివరాత్రి రోజు ఉపవాస దీక్షతో జాగరణ చేసే భక్తులు రాత్రి సమయంలో తప్పకుండా చిలగడ దుంపలను తింటారు.అసలు శివరాత్రికి ఈ చిలగడ దుంపలకు మధ్య సంబంధం ఏమిటి? అనే విషయాల గురించి ఇక్కడ పూర్తిగా తెలుసుకుందాం.

 Do You Know What Is The Connection Between Shivaratri And Kandagarda-శివరాత్రికి, కందగడ్డకు సంబంధం ఏమిటో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పూర్వకాలంలో అడవిలో నివసించే అటవికులు శివ రాత్రి సమయాలలో ఎక్కువగా స్వామివారికి నైవేద్యంగా చిలగడదుంపలు సమర్పించి జాగరణ చేస్తూ భక్తులకు వాటినే ప్రసాదంగా తినేవారు.ఒక విచిత్రమైన సంగతి ఏమిటంటే ఈ దుంపలు ఏడాది మొత్తం శివరాత్రికి మాత్రమే కనిపిస్తాయి.

అందువల్ల అటవీ జాతికి చెందినవారు ఈ చిలగడ దుంపలను ఎక్కువగా స్వామివారికి నైవేద్యంగా సమర్పించే వారు.అందువల్ల అప్పటినుంచే శివరాత్రికి ప్రత్యేకమైన నైవేద్యంగా చిలగడదుంపలు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది.

Telugu Connection, Kandagarda, Pooja, Shiva Ratri-Telugu Bhakthi

ఈ చిలగడ దుంపల విషయంలో ఒక విచిత్రమైన సంగతి ఏమిటంటే ఇవి ఎప్పుడు వేసిన శివరాత్రి సమయానికి మాత్రమే చేతికి వస్తాయి.అందుకే మహాశివరాత్రి సందర్భంగా రైతులు పెద్ద ఎత్తున దుంపలను మార్కెట్లో విక్రయిస్తారు.శివరాత్రి రోజు భక్తులు ఉపవాసం చేస్తూ జాగరణలో ఉండటం వల్ల ఎంతో నీరసించిపోతారు.ఆ విధంగా వారికి నీరసం రాకుండా ఉండటం కోసం ఈ దుంపలను నైవేద్యంగా ప్రసాదిస్తారు.

ఇందులో అధిక మొత్తంలో పోషక పదార్థాలు ఉండటం వల్ల మన శరీరం శక్తిని కోల్పోకుండా కాపాడుతుంది.మన శరీరానికి కావల్సినంత శక్తిని అందించడంలో ఈ కంద గడ్డలు ప్రముఖ పాత్ర వహిస్తాయి.

అందుకోసమే మహాశివరాత్రి సమయంలో ఈ కంద గడ్డలను మార్కెట్లో విరివిగా విక్రయిస్తారు.ఇందులో విటమిన్స్, ఐరన్, క్యాల్షియం వంటి పోషక పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల ఇవి శరీరానికి ఎంత శక్తిని అందిస్తాయని చెప్పవచ్చు.

#Pooja #Connection #Shiva Ratri #Kandagarda

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

DEVOTIONAL