పింఛన్ ఇప్పిస్తానని వేలి ముద్రలు తీసుకుని ఏం చేసాడో తెలుసా ఆ ఘనుడు ...?!

ఈమధ్య మోసగాళ్లు ప్రజల్ని మోసం చేయడానికి వివిధ రకాల కొత్త పథకాలను అనుసరించి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు.తాజాగా తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ వ్యక్తి పింఛన్ ఇస్తా అని చెప్పి కొందరి రైతులు, అలాగే మహిళల నుండి వేలిముద్రలు సేకరించాడు.

 Do You Know What He Did With The Fingerprints That The Pension Would Give,  Pens-TeluguStop.com

అలా సేకరించిన వారి వేలి ముద్రల ద్వారా ఏకంకా వారి బ్యాంకు ఖాతాల్లో నగదు ను కాజేశాడు.

యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం గౌరవ పల్లి గ్రామానికి చెందిన భాస్కర్ కొన్ని రోజుల నుండి పల్లె ప్రాంతాల్లో ఉన్న అమాయకపు ప్రజల వద్ద ఇలా వేలిముద్రలు సంపాదించి, వారి ఖాతాల్లో నుంచి డబ్బును కాజేస్తున్నాడు.

ఇందులో భాగంగానే తాజాగా అదే గ్రామానికి చెందిన ఓ మహిళకు పెన్షన్ ఇస్తానని ఆమె ఫింగర్ ప్రింట్ మిషన్‌ పై నాలుగు సార్లు వేలిముద్రలు తీసుకున్నాడు.

ఇక అంతే దెబ్బకి రెండు రోజుల్లో ఆమె ఖాతా నుండి ఏకంగా రూ.57,000 మాయమయ్యాయి.ఇలా మరొకరికి డిటిహెచ్ రీఛార్జ్ చేస్తానని చెప్పి రూ.10 వేల రూపాయలు మాయం చేశాడు.మరో రైతుకు పొలం సంబంధించిన పాసుపుస్తకాలు ఇప్పిస్తానని రూ.67,000, అలాగే మరో నలుగురి వద్ద ఏకంగా రూ.4 లక్షల వరకు కొల్లగొట్టాడు.దీంతో బాధితులు అంత గ్రామ సర్పంచ్ కు వారి విషయం చెప్పుకోగా, సర్పంచ్ పోలీసులకు సమాచారం అందించాడు.అయితే అప్పటికే భాస్కర్ పరారీలో ఉన్నాడు.అదే సమయంలో మరో మహిళ తనకు తెలియకుండానే తన బ్యాంక్ అకౌంట్ లోనే రూ.30 వేలు డ్రా చేశాడంటూ అతనిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందింది.ఈ మేరకు భాస్కర్ పై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube