వెహికల్ టైర్స్ ఎక్కువకాలం వాడకపోతే ఏం జరుగుతుందో తెలుసా?

కొంతమంది తాము వాడే వెహికల్స్ పట్ల ఒకింత నిర్లక్ష్య వైఖరితో వుంటారు.మనలో చాలామందికి బండి వాడే విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి తెలియని తెలియదు.

 Do You Know What Happens To Vehicle Tires If They Are Not Used For A Long Time,-TeluguStop.com

అందువల్లనే తరచూ వారు తమ బండి పాడైపోతోందని కంప్లైంట్ చేస్తూ వుంటారు.కీలకమైన అంశాలకు సంబంధించి అవగాహన లేకపోతే తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు.ముఖ్యంగా బ్రేక్ షూ, ఇంజిన్ ఆయిల్, టైర్ లకు సంబంధించి తెలుసుకోవాలి.2500 నుంచి 3000 వేల కిలోమీటర్లు తిరిగితే బ్రేక్ షూ మార్చుకోవాలి.అలాగే ఇంజిన్ ఆయిల్ విషయంలో కూడా అంతే పర్టిక్యులర్ గా ఉండాలి.

ఇక ముఖ్యంగా టైర్స్ విషయానికి వస్తే… బైక్ టైర్ కు ఎక్కువ పంచర్లు ఉన్నట్లయితే గనుక మీ టైర్ రోడ్ పై పట్టు కోల్పోయినట్లు నడుస్తుంది.

దీనిని మీరు గమనించుకోవాలి.అలాంటి టైర్ లతో బైక్ నడపితే మీకు రైడింగ్ అంత క్షేమకరం కాదు.కాబట్టి మీరు టైర్స్ ని మార్చుకోవడం ఉత్తమం.లేదంటే మీ బైక్ మైలేజ్ కూడా సరిగా రాదు.

ఒకోసారి టైర్ పేలిపోయి ప్రమాదాలు కూడా సంభవించే అవకాశం లేకపోలేదు.

Telugu Bike Tire, Ups, Vehicles-Latest News - Telugu

అలాగే ఎక్కువకాలం పాటు బండి కదల్చకుండా ఉన్నా సరే టైర్లు పాడయ్యే అవకాశం లేకపోలేదు.టైర్ బాగానే ఉండి పంచర్లు, కట్ లు లేకున్నా సరే మూడేళ్లకు ఒకసారి మార్చుకోవడం ఉత్తమం.కాలం గడుస్తున్న కొద్దీ రబ్బర్ లోని నూనెలు ఆవిరైపోవడం వల్ల కూడా టైర్ మృదుత్వాన్ని కోల్పోయి, గట్టిగా ఓ రాయి మాదిరిగా మారిపోతుంది.

టైర్ ఎప్పుడు తయారయిందో తెలిపే 4 అంకెల సంఖ్య టైర్ మీద ఉంటుంది.దీనిని చాలామంది గమనించరు.చివరి రెండంకెలు తయారైన సంవత్సరాన్ని అలాగే మొదటి రెండు అంకెలు ఆ సంవత్సరంలో ఎన్నో వారంలో అది తయారయిందో చెప్తాయి.అలాగే టైర్ గాలి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటే ఉత్తమం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube