హెల్తీగా, ఫీట్‌గా ఉండాలంటే శరీరానికి నిద్ర ఎంతో అవసరం.కంటి నిండా నిద్ర ఉంటేనే రోగాలకు దూరంగా ఉంటారు.
అందుకే రోజుకు ఖచ్చితంగా ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్ర పోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.కానీ, నేటి టెక్నాలజీ యుగంలో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా చాలా మంది నిద్రను నిర్లక్ష్యం చేస్తూ.
ఫోన్లు, టీవీలు, ల్యాప్ టాప్‌లతో టైమ్ మొత్తాన్ని గడిపేస్తున్నారు.అందులోనూ కొందరైతే నిద్ర వస్తున్నా బలవంతంగా ఆపుకుని మేల్కొనేందుకు ప్రయత్నిస్తుంటారు.
కానీ, అలా చేయడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు వైద్య నిపుణులు.ముఖ్యంగా నిద్రను బల వంతంగా ఆపుకునే వారిలో గుండె పోటు మరియు గుండె సంబంధిత జబ్బులు వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుందట.
అలాగే రోగ నిరోధక వ్యవస్థ కూడా బలహీన పడి పోయి.అనేక రోగాలు చుట్టు ముట్టేస్తాయని నిపుణులు అంటున్నారు.

అంతే కాదు, నిద్రను బల వంతంగా ఆపుకుని మేల్కొనేందుకు ప్రయత్నిస్తే.శరీర బరువు అదుపు తప్పి భారీగా పెరిగి పోతారు.షుగర్ వ్యాధి వచ్చే ప్రమాదం పెరుగుతుంది.శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది.చిన్న వయసులోనే మతి మరపు ప్రారంభం అవుతుంది.మరియు ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన, తల నొప్పి వంటి మానసిక సమస్యలు సైతం తీవ్రంగా వేధిస్తుంటాయి.
అందు వల్లనే, నిద్రను బల వంతంగా ఆపుకో కూడని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.అయితే శరీరానికి నిద్ర అవసరం కదా అని.పగటి పూట పడుకుని రాత్రి వేళ టీవీ, ల్యాప్ టాప్, ఫోన్లతో కాలక్షేపం చేస్తుంటారు.కానీ, అలా చేయడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు.
ఇలా చేస్తే మరిన్ని సమస్యలు ఇబ్బంది పెడతాయి.జాగ్రత్త!!
.