ఉపవాసం.దీని గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు.కొందరు భక్తి పరంగా ఉపవాసం చేస్తే.మరి కొందరు బరువు తగ్గేందుకు, ఫిట్‌గా మారేందుకు ఉపవాసం చేస్తుంది.కారణం ఏదైనప్పటికీ.ఉపవాసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
ఉపవాసం చేయడం వల్ల శరీరంలో అదనపు కేలరీలు తగ్గడంతో పాటు షుగర్ లెవల్స్ అదుపులోకి రావడం, జీర్ణ వ్యావస్థ పని తీరు మెరుగు పడటం, గుండె జబ్బులు వచ్చే రిస్క్ తగ్గడం ఇలా ఎన్నో బెనిఫిట్స్ లభిస్తాయి.
అయితే ఉపవాసం చేసేటప్పుడు బాడీని ఎప్పుడు హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి.
అందుకే కొందరు ఉపవాసం చేసేటప్పుడు పాలు, కొబ్బరి నీరు, ఫ్రూట్ జ్యూసులు తీసుకుంటూ ఉంటాయి.కానీ, కొందరు మాత్రం ఉపవాసం చేసే సమయంలో పాలు తీసుకోవడానికి అస్సలు ఇష్టపడరు.
మరి ఇంతకీ ఉపవాసం చేసే సమయంలో పాలు తీసుకోవచ్చా.? తీసుకోరాదా.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
వాస్తవానికి పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ పాలు తీసుకోవచ్చు.పాలలలో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్సతో పాటు కేలరీలు, సహజ చెక్కర, పిండి పదార్థాలు కూడా ఉంటాయి.
అందువల్ల, ఉపవాసం సమయంలో పాలు తీసుకుంటే.ఇన్సులిన్ అనే హార్మోన్ విడుదలను ప్రేరేపిస్తాయి.
మరియు శరీరంలో కేలరీలు కూడా పెరగుతాయి.
దాంతో ఉపవాసం చేసిన ఫలితం లేకుండా పోతుంది.
కాబట్టి, ఉపవాసం చేసే సమయంలో పాలు తీసుకోకపోవడమే మంచిదని అంటున్నారు.పాలుతో పాల పదార్థాలకు కూడా దూరంగా ఉంటే మేలంటున్నారు.
ఒకవేల అంతగా తాగాలి అని అనుకుంటే.పాలకు బదులుగా టీ, కాఫీ వంటివి తీసుకుంటే నీరసం రాకుండా ఉంటుంది.
అయితే వీటిలో షుగర్, క్రీమ్ కలపకుండా తీసుకోవాలి.అలాగే ఉపవాసం సమయంలో వాటర్‌ను ఎక్కువగా తీసుకోవాలి.