నెమలి పించం ఇంట్లో ఉంటే ఏం జరుగుతుందో తెలుసా?

మన జాతీయ పక్షిగా నెమలికి ఎంతో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.అందమైన పక్షుల లో నెమలి ఒకటి సాయంత్రం సమయాలలో అందమైన వాతావరణంలో నెమలి పురివిప్పి నాట్యం చేస్తుంటే, కను తిప్పకుండా చూడాలనిపిస్తుంది.

 Peacock Feather, Hindu Believes, Home, Mythology-TeluguStop.com

మన చిన్నప్పుడు నెమలి ఈకలు పుస్తకాలలో దాచుకుని ఎంతో మురిసి పోతూ ఉంటాము.మరికొందరు వాటిని ఇంటిలో అలంకరణ వస్తువుగా పెడుతుంటారు.

అయితే నెమలి పించం ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఎలాంటి పరిణామాలు జరుగుతాయో తెలుసా? నెమలి పించం ఇంట్లో ఉండడం వల్ల ఏం జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం…

పురాణాల ప్రకారం నెమలి ఎంతో అందవిహీనంగా ఉండే ఒక సాధారణ పక్షి.అయితే ఇంద్రుడు ఒక అసురుడు నుంచి తన ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఇంద్రుడి ప్రాణాలను నెమలి ఈకలలో దాచుకోవడానికి సహకరించడం వల్ల ఇంద్రుడు ఆ నెమలికి ఆ అందాన్ని వరంగా ఇస్తాడని, మన భారతీయ పురాణాలు చెబుతున్నాయి.

వాస్తు శాస్త్ర ప్రకారం నెమలి ఈకలు మన ఇంటిలో పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో ఏర్పడిన ప్రతికూల పరిస్థితులను పారద్రోలి అనుకూల వాతావరణాన్ని కలిగిస్తుంది.మన ఇంటి గుమ్మం దగ్గర వినాయకుడి విగ్రహం తో పాటు నెమలి పించం పెట్టడం వల్ల ఎలాంటి చెడు ప్రభావాలు మన ఇంటి లోనికి ప్రవేశించవు.

పురాణాల ప్రకారం నెమలి ,పాము శత్రువులు అయితే గ్రహాలలో రాహువు పాక్షికంగా పాము కాబట్టి, నెమలి పించం మన ఇంటిలో పెట్టుకోవడం వల్ల రాహు ప్రభావం మన ఇంటి మీద ఉండదు.

మన ఇంటి దక్షిణ దిశలో కుబేరుడు కొలువై ఉంటాడని విశ్వసిస్తారు.

అందువల్లే నెమలి పించం దక్షిణదిశలో పెట్టడం వల్ల మనకు సంపద చేకూరుతుంది.నెమలి పించం చిన్నపిల్లల దిండు కింద ఉంచడం వల్ల ఎటువంటి చెడు ప్రభావం వారి మీద పడకుండా, ఎంతో ఆరోగ్యంగా ఉంటారు.

నెమలి పించం పుస్తకాలలో పెట్టుకోవడం వల్ల సరస్వతి భాగ్యం కలుగుతుందని మన నమ్మకం.వివాహ జీవితంలో ఎటువంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఉండాలంటే పడకగదిలో నెమలి పించం కచ్చితంగా పెట్టుకోవాల్సిందే.

నెమలి పించం లో ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఎన్నో శుభ పరిణామాలు జరుగుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube