యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, సినీ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరైన సమంతను ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసినదే.చేతినిండా సినిమాలతో బిజీగా గడుపుతున్న సమంత నాగచైతన్యతో ప్రేమలో పడి తెలుగింటి కోడలుగా అడుగు పెట్టారు.
వీరిద్దరి ప్రేమ ప్రయాణం ఎలా మొదలైందీ, తొలిసారిగా సమంత ఫోటోలు చూసి నాగ చైతన్య తన మనసులో ఏమనుకున్నారో? అనే విషయం గురించి నాగచైతన్య మాట్లాడుతూ…
తొలిసారిగా “ఏం మాయ చేసావే” సినిమా ఆడిషన్స్ లో నాగచైతన్య సమంత ఫోటోలు చూశారు.ఫోటో చూడగానే అమ్మాయి బాగుంది.
మన సినిమాకు పనికి వస్తుందని తన మనసులో అనుకున్నారట.కానీ ఏకంగా తననే పెళ్లి చేసుకునీ ఇంటికి కోడలిగా సమంత వస్తుందని ఎప్పుడూ అనుకోలేదని ఈ సందర్భంగా నాగచైతన్య తెలియజేశారు.

సమంత గురించి చెబుతూ సమంత ఎంతో సర్దుకుపోయే స్వభావం ఉన్న వ్యక్తి అని.సమంతది మధ్యతరగతి కుటుంబం కావడంతో ఎన్నో కష్టాలు పడుతూ పైకొచ్చిన సమంతకు ఎటువంటి పరిస్థితులనైన తట్టుకొనే స్వభావం కలిగి ఉంటుందని భావించారు.అయితే సమంతను పెళ్లి చేసుకుంటానని ఇంట్లో డైరెక్ట్ గా చెప్పకుండా చిన్న పార్టీలకు ఇంటికి తీసుకెళ్లి అందరికీ పరిచయం చేశారట.కొద్దిరోజుల తర్వాత సమంతను పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పడానికి భయమేసిందని, కానీ చెప్పగానే నాగార్జున గారు అర్థం చేసుకున్నారని చైతన్య తెలియజేశారు.
చైతన్య పెళ్లి విషయంలో నాగార్జున గారు సమంత ని ఎందుకు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావు? చేసుకుంటే ఇద్దరూ సంతోషంగా ఉండగలరా? అని నాగార్జున గారు అడిగారట.అయినా నాన్న నన్ను అలా ప్రశ్నించడం ఎంతో అవసరమని, తమ పిల్లల పట్ల తల్లిదండ్రులకు కొన్ని భయాలు, బాధ్యతలు ఉన్నాయని పెళ్లికి ముందు జరిగిన సంఘటనను నాగ చైతన్య ఓ సందర్భంలో తెలియజేశారు.