ఈ హీరోల కేరీర్లో బెస్ట్ ఇంట్రడక్షన్ సాంగ్స్ ఏంటో తెలుసా?

ప్రతి ఒక్క సినిమాలో సాంగ్స్ ఉండటం సహజమే.ఎందుకంటే ప్రేక్షకులు కాస్త ఎంటర్టైన్మెంట్ ను కోరు కుంటారు కాబట్టి.

 Do You Know The Best Introduction Songs Of These Heroes Ntr Ram Chanran Pawan Ka-TeluguStop.com

సినిమాలలో టైమింగ్ తగ్గట్టు పాటలను పెడుతూ ఉంటారు.అందులో ఎమోషనల్, లవ్, మాస్ ఇలా కొన్ని రకాల పాటల రుచులను చూపిస్తుంటారు.

అలా కొన్ని పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి.కొన్ని సందర్భాలలో హీరోల ఎంట్రీతో కూడా ఇంట్రడక్షన్ సాంగ్ లు వస్తుంటాయి.

అవి కూడా బాగా హైలెట్ గా ఉంటాయి.అవి ప్రేక్షకులకే కాకుండా హీరోలకు కూడా మంచి క్రేజ్ ను అందిస్తాయి.అలా కొంత మంది హీరోలు ఉండగా వారి కేరీర్ బెస్ట్ ఇంట్రడక్షన్ సాంగ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎన్టీఆర్ – జై లవకుశ:

2017 లో యాక్షన్ డ్రామా తో తెరకెక్కిన సినిమా జై లవకుశ.ఇందులో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేశాడు.ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది.ఇందులో పాటలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.ఈ సినిమాలో రావణ ఎంట్రి ఉన్నప్పుడు ‘రావణా’ అనే సాంగ్ మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.పైగా ఎన్టీఆర్ లుక్ కు ఈ పాట బాగా సెట్ అయింది.

మహేష్ బాబు – అతడు:

Telugu Allu Arjun, Arya, Billa, Career, Gabbar Singh, Jai Lava Kusha, Pawan Kaly

2005లో మహేష్ బాబు నటించిన సినిమా అతడు.సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు.ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కూడా అందుకుంది.

అందులో పాటలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.అందులో ‘అదరక బదులే చెప్పేటి నిప్పుకణం అతడే’ అనే పాట ఎంట్రీ తో బాగా ఆకట్టుకుంటుంది.ఈ పాట ప్రేక్షకులను కూడా ఫిదా చేసింది.

రామ్ చరణ్ – రచ్చ:

Telugu Allu Arjun, Arya, Billa, Career, Gabbar Singh, Jai Lava Kusha, Pawan Kaly

2012లో విడుదలైన సినిమా రచ్చ.ఈ సినిమాతో రామ్ చరణ్ మంచి సక్సెస్ అందుకున్నాడు.అంతేకాకుండా పలు భాషలలో కూడా ఈ సినిమా విడుదలై మంచి సక్సెస్ అందుకుంది.

ఇందులో కూడా ఎంట్రీ సాంగ్ ‘రచ్చ’ బాగా దుమ్ములేపిందనే చెప్పవచ్చు.ఈ పాటను చంద్రబోస్ రచించాడు.

ప్రభాస్ – బిల్లా:

Telugu Allu Arjun, Arya, Billa, Career, Gabbar Singh, Jai Lava Kusha, Pawan Kaly

2009లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న సినిమా బిల్లా.ఇందులో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేశాడు.ఇక ఈ సినిమా ఇప్పటికీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.ఇక ఇందులో బిల్లా ఎంట్రీ అప్పుడు ‘మై నేమ్ ఈజ్ బిల్లా’ మాత్రం ఓ రేంజ్లో సక్సెస్ అందుకుంది.ప్రభాస్ కు ఈ సాంగ్ మాత్రం బాగా సెట్ అయిందనే చెప్పవచ్చు.

అల్లు అర్జున్ – ఆర్య 2:

Telugu Allu Arjun, Arya, Billa, Career, Gabbar Singh, Jai Lava Kusha, Pawan Kaly

2009లో సుకుమార్ దర్శకత్వంలో విడుదలైన సినిమా ఆర్య 2.ఈ సినిమా ఆర్య కు సీక్వెల్ గా తెరకెక్కింది.కానీ ఎందుకో అంతగా సక్సెస్ కాలేకపోయింది.

ఇక ఇందులో పాటలు మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.ముఖ్యంగా ‘మిస్టర్ పర్ఫెక్ట్’ పాట మాత్రం ఈ సినిమాకు బాగా హైలెట్ గా నిలిచింది.

పవన్ కళ్యాణ్ – గబ్బర్ సింగ్:

Telugu Allu Arjun, Arya, Billa, Career, Gabbar Singh, Jai Lava Kusha, Pawan Kaly

2012లో విడుదలైన సినిమా గబ్బర్ సింగ్.హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది.ఇందులో పాటలు కూడా అన్ని బాగా సక్సెస్ అందుకున్నాయి.అందులో టైటిల్ సాంగ్ ‘దేఖో దేఖో గబ్బర్ సింగ్’ అనేది ప్రేక్షకులను బాగా ఫిదా చేసింది.ఇక ఇవే కాకుండా పలువురి హీరోల ఎంట్రీ సాంగ్స్ కూడా బాగానే ఆకట్టుకున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube