కాశ్మీరీ పండిట్ల వలసల బాధను చూపిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రం మార్చి 11న దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది.బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఈ చిత్రానికి వినోదపు పన్ను నుంచి మినహాయింపు నిచ్చారు.
నిజానికి వినోదపు పన్ను మినహాయింపు సినిమా అంటే ఏమిటో మీకు తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.ఒరిస్సా పోస్ట్ నివేదిక ప్రకారం 2017లో జిఎస్‌టి అమలులోకి వచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వం సినిమా హాళ్ల నుంచి వినోదపు పన్ను వసూలు చేస్తూ వచ్చింది.
అయితే కొత్త పన్ను అమలు తర్వాత దేశంలోని ప్రతి రాష్ట్రంలో సినిమా టిక్కెట్లపై 28 శాతం జీఎస్టీ వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.అయితే సినిమా పరిశ్రమకు ఊరటనిస్తూ ప్రభుత్వం దానిని తగ్గించింది.
ఈ మార్పు రెండు స్లాబ్‌లుగా విభజించారు.
మొదటిది: థియేటర్‌లో టికెట్ ధర రూ.100 కంటే తక్కువ ఉంటే, అది 12 శాతం జిఎస్‌టి వర్తిస్తుంది.రెండవది: టికెట్ ధర రూ.100 కంటే ఎక్కువ ఉంటే టిక్కెట్‌పై 18 శాతం జిఎస్‌టి విధిస్తారు.దీనిని ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకుంటే.
ఉదాహరణకు, ఉత్తరప్రదేశ్‌లో ఏదైనా సినిమా టిక్కెట్‌పై 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు.పన్ను మినహాయింపుగా మారిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వం తన వాటాలో 9 శాతం పన్ను పరిధి నుండి మినహాయించినందున 18కి బదులుగా 9 శాతం పన్ను విధిస్తారు.
అందువల్ల విధిస్తున్న 9% పన్ను కూడా కేంద్రం వాటానే.ఈ లెక్క ప్రకారం రాష్ట్రానికి తన పన్ను వాటాలో 50 శాతం మాత్రమే మాఫీ చేసే హక్కు ఉంటుంది.
స్పూర్తిని నింపే సినిమాలు, జాతీయ స్థాయి వ్యక్తులపై తీసిన సినిమాలు, మత సామరస్యాన్ని పెంపొందించే సినిమాలకు వినోదపు పన్ను మినహాయింపు నిస్తారు.ఇలాంటి సినిమాలు సమాజంపై మంచి ప్రభావం చూపుతాయనే భావినతో ఈ అవకాశం కల్పిస్తారు.
అయితే దీనిపై ఆయా రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవాల్సివుంటుంది.