మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ( Varun Tej ) త్వరలోనే ఆపరేషన్ వాలంటైన్( Operation Valentine ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు ఈ సినిమా మార్చి 1వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఎయిర్ ఫోర్స్ బ్యాక్గ్రౌండ్ ఈ సినిమాకు శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో వరుణ్ సరసన మానుషీ చిల్లర్ హీరోయిన్ గా నటిస్తున్నారు.
ఇక ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వరుణ్ తేజ్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన ఇప్పటివరకు ఎవరికీ తెలియదు ఒక విషయాన్ని వెల్లడించారు.తాను హీరోగా మాత్రమే కాకుండా చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా ఓ సినిమాలో నటించాను అనే విషయాన్ని వరుణ్ తేజ్ ఇటీవల వెల్లడించారు.
మరి వరుణ్ తేజ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించినటువంటి సినిమా ఏంటి అనే విషయాన్ని వస్తే.వరుణ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించినటువంటి ఈ సినిమాలో నాగబాబు బ్రహ్మానందం వంటి వారు ప్రధాన పాత్రలలో నటించారని ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ రోల్ చేశారని వెల్లడించారు.
ఇలా గెస్ట్ పాత్రలో చిరంజీవితో పాటు వరుణ్ తేజ్ కూడా ఈ సినిమాలో నటించారట .మరి వరుణ్ నటించిన ఆ సినిమా ఏంటి అనే విషయానికి వస్తే.

హేండ్సప్ ( Hands Up ) అనే క్రైమ్ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ శివ నాగేశ్వర రావు డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి హీరోయిన్ జయసుధ కథని అందించడం విశేషం.ఆ సినిమాకు స్టోరీ ఇవ్వడంతో పాటు మూవీలో ముఖ్య పాత్రని పోషించారు.ఇక ఈ సినిమాలోని ఓ ఫైట్ సన్నివేశంలో సోనూసూద్ ని చిరంజీవి కొట్టిపడేస్తారు.ఆ సీన్ లోనే వరుణ్ తేజ్ అలా ఒక డైలాగ్ చెప్పి వెళ్ళిపోతారు.

ఇలా ఈ సినిమా ద్వారా బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి వరుణ్ తేజ్ అనంతరం ముకుంద సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు.ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇలా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈయన తన కెరీర్ కి సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు.







