ఈ తెలుగు హీరోల ఒరిజినల్ పేర్లు ఏంటో తెలుసా..?

సినిమా నటుల్లో చాలా మందికి రెండు పేర్లు ఉన్నాయి.సినిమాల్లోకి రాక ముందు ఒక పేరు ఉండగా.

 Do You Know Tollywood Heros Original Names-TeluguStop.com

వచ్చాక మరో పేరు పెట్టుకున్నారు.కొణిదెల శివ శంకర వరప్రసాద్ పేరు చిరంజీవిగా మారగా.

శివాజీ రావ్ గైక్వాడ్ పేరు రజనీ కాంత్ అయ్యింది.భక్తవత్సలం నాయుడూ మోహన్ బాబుగా మారింది.

 Do You Know Tollywood Heros Original Names-ఈ తెలుగు హీరోల ఒరిజినల్ పేర్లు ఏంటో తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వీరే కాదు మరికొంత మంది హీరోలకూ రెండు పేర్లు ఉన్నాయి.వారి అసలు పేర్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.

యశ్

Telugu Tollywood Heros Names-Telugu Stop Exclusive Top Stories

బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన కేజీఎఫ్ హీరో యశ్.అతడి అసలు పేరు నవీన్ కుమార్ గౌడ.స్టేజ్ షోలతో ప్రారంభం అయిన తన కెరీర్.కేజీఎఫ్ తో దేశ వ్యాప్తంగా స్టార్ హీరోగా ఎదిగాడు.

నాని

Telugu Tollywood Heros Names-Telugu Stop Exclusive Top Stories

చురల్ స్టార్ నాని అసలు పేరు గంటా నవీన్ బాబు.అసిస్టెంట్ డైరెక్టర్ గా, రేడియో జాకీ గా మొదలైన కెరీర్ అలా మొదలైంది సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చాడు.

ప్రభాస్

Telugu Tollywood Heros Names-Telugu Stop Exclusive Top Stories

ప్రభాస్ అసలు పేరు ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు.ఈశ్వర్ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈయన.బాహుబలితో ఇండియన్ స్టార్ హీరోగా ఎదిగాడు.

ధనుష్

Telugu Tollywood Heros Names-Telugu Stop Exclusive Top Stories

ధనుష్ అసలు పేరు వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా.తమిళ సినిమాలతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా ధనుష్ పరిచయస్తుడే.

సంపూర్ణేష్ బాబు

Telugu Tollywood Heros Names-Telugu Stop Exclusive Top Stories

సంపూ అసలు పేరు నరసింహా చారి.హృదయ కాలేయం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి.మంచి నటుడిగా గుర్తింపు పొందాడు.ఆయా క్లిష్ట సమయాల్లో తనకు తోచిన సాయం చేస్తూ మనసున్న మహారాజుగా నిలుస్తున్నాడు.

విక్రమ్

Telugu Tollywood Heros Names-Telugu Stop Exclusive Top Stories

విక్రమ్ అసలు పేరు కెన్నెడీ జాన్ విక్టర్.అక్కపెత్తనం చెల్లెలి కాపురం సినిమాలో రాజేంద్రప్రసాద్ స్నేహితుడిగా నటించాడు విక్రమ్.తర్వాత బంగారు కుటుంబం ఇతర సినిమాలు చేసి స్టార్ అయ్యాడు.

రవితేజ

Telugu Tollywood Heros Names-Telugu Stop Exclusive Top Stories

రవితేజ అసలు పేరు రవిశంకర్ రాజు భూపతిరాజు.జూనియర్ ఆర్టిస్టుగా మొదలైన అతడి కెరీర్.శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన నీకోసం సినిమాలో హీరోగా చేశాడు.అక్కడి నుంచి రవితేజ వెనక్కి తిరిగి చూసుకోకుండా స్టార్ హీరోగా ఎదిగాడు.

సూర్యా

Telugu Tollywood Heros Names-Telugu Stop Exclusive Top Stories

ఇతడి అసలు పేరు శరవణన్ శివ కుమార్.గజిని, సూర్య సన్నాఫ్ క్రిష్ణన్, సింగం సినిమాలతో సూర్య టాప్ హీరోగా ఎదిగాడు.

#TollywoodHeros

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు