ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ సరికొత్త ట్రిక్ మీకు తెలుసా..

సోషల్ మీడియా వినియోగం పెరిగాక, ఎన్నో యాప్‌లు ప్రజలను అలరిస్తున్నాయి.ముఖ్యంగా యువత వీటికి బాగా అలవాటు పడ్డారు.

 Do You Know This Latest Trick On Instagram , Instagram , Reel , Account , Trick , Technology Updates , Technology News Technology , Instagram New Trick-TeluguStop.com

అయితే టీనేజర్ల విషయంలో పరిస్థితి కొంత ఆందోళనకరంగా కనిపిస్తోంది.తరచూ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ, ఎంతో మంది అభిమానులను వారు సంపాదించుకుంటున్నారు.

వారు పెట్టే డ్యాన్స్, ఇతర వీడియోలకు ఇన్‌స్టాగ్రామ్‌లో వేల సంఖ్యలో లైకులు, లక్షల సంఖ్యలో వ్యూస్ వస్తుంటాయి.అయితే ఒక్కోసారి కొన్ని వీడియోలకు అభిమానులు, ఫాలోవర్ల నుంచి తగిన స్థాయిలో స్పందన ఉండదు.

 Do You Know This Latest Trick On Instagram , Instagram , Reel , Account , Trick , Technology Updates , Technology News Technology , Instagram New Trick-ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ సరికొత్త ట్రిక్ మీకు తెలుసా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో చాలా డిప్రెషన్‌లోకి టీనేజర్లు వెళ్లిపోతున్నారు.తమ జీవితంలో ఏదో పెద్ద మొత్తంలో కోల్పోయినట్లు భావిస్తున్నారు.

ఇది టీనేజర్లలో ప్రతికూల మానసిక ఆరోగ్య ఫలితాలకు దారి తీస్తోంది.అందుకే దీనిపై ఇన్‌స్టాగ్రామ్ ఓ సరికొత్త ట్రిక్ అందుబాటులోకి తీసుకొచ్చింది.

దానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదైనా రీల్స్ చేసి ఆ వీడియోలు పోస్ట్ చేస్తే, తరచూ ఎన్ని లైకులు వచ్చాయో పరిశీలించడం చాలా మందికి అలవాటు అయిపోయింది.

ఏ మాత్రం వ్యూస్, లైకులు తక్కువగా వస్తే బాగా ఫీల్ అయిపోతున్నారు.అందుకే లైకులు ఎన్ని వచ్చాయో హైడ్(HIDE) చేసే అవకాశం ఉంది.ఫలితంగా కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.ఇందుకు మీరు ఇలా చేయొచ్చు.

మీ ప్రొఫైల్ పేజీ యొక్క కుడి వైపున పైభాగంలో ఉన్న మెనూ (Menu) బార్‌పై క్లిక్ చేయండి.అక్కడ సెట్టింగ్స్ (Settings) ఆప్షన్ ఎంచుకోవాలి.

ఆ తర్వాత ప్రైవసీ (Privacy) ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.ఇది పూర్తైన తర్వాత పోస్టులు (Posts) ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.

అక్కడ మీకు Hide Like and View Count అనే ఆప్షన్ కనిపిస్తుంది.దానిని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది.

ఈ ఒక్క ట్రిక్‌తో మీ రీల్స్ వ్యూస్, లైకుల సంఖ్య కనిపించదు.దీంతో తమకు తక్కువ లైకులు వచ్చాయనే బాధ ఉండదు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube