సృష్టి శ్రీవాస్తవ్ ఎవరు... ఆమె గురించి ఎవరికీ తెలియని నిజాలు ఇవే!

ఉద్యోగంలో చేరిన కొద్ది రోజులకే రాజీనామా చేసి సినిమాల మీద మక్కువతో హీరోయిన్ కావాలనుకున్న నటి సృష్టి శ్రీవాస్తవ్‌.పుట్టింది లక్నోలో ఐనా… చదివిందంతా ముంబైలోనే.

 Unknown Facts About Actress Srishti Shrivastava, Srishti Shrivastava, Web Series-TeluguStop.com

మాస్‌మీడియా కోర్సు చేసి, ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగంలో చేరినా… కొన్ని రోజుల్లోనే… ఆ ఉద్యోగాన్ని వదిలి హీరోయిన్ కావాలనుకుని ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు.

అందరిలాగే తాను కూడా అవకాశాల కోసం ఎంతో కష్టపడాల్సి వచ్చింది.

ఓ స్నేహితుడి సలహా మేరకు మొదట ఓ డ్రామా స్కూల్‌లో చేరి… అక్కడే స్టేజ్‌ షోలు చేస్తూ అనతికాలంలోనే మంచి థియేటర్‌ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకున్నారు సృష్టి.‘శిఖండి – ద స్టోరీ ఆఫ్‌ ది ఇన్‌ బిట్‌వీన్స్‌’ స్టేజ్‌ షోకు గాను ఆమెకు ‘ఎమ్‌ఈటీఏ (మహీంద్రా ఎక్సలెన్స్‌ ఇన్‌ థియేటర్‌ అవార్డ్స్‌)’ నుంచి బెస్ట్‌ యాక్ట్రెస్‌ ఇన్‌ సపోర్టింగ్‌ రోల్‌ పురస్కారం దక్కించుకున్నారు.

ఓ పక్క స్టేజ్‌ షోలు చేస్తూనే, వందకు పైగా వాణిజ్య ప్రకటనల్లో కనిపించి.ఔరా అనిపించుకున్నారు.‘రాజస్థాన్‌ టూరిజం’ యాడ్‌ షూట్‌కు సెలెక్ట్‌ అయి… అత్యంత పేరును సాధించారు.

Telugu Actresssristi, Ad, Ap, Bollywood, Dil Jangli, Hostel Web, Web-Movie

2017లో ‘పీఏ–గర్ల్స్‌’ అనే టీవీ సీరియల్లో, ‘దిల్‌ జంగ్లీ’, ‘గులాబో సితాబో’ అనే సినిమాల్లో నటించినా… అత్యంత గుర్తింపు తెచ్చిపెట్టింది మాత్రం వెబ్‌సిరీస్‌ ‘గర్లియాపా’.ఇది ప్రేక్షకాదరణపొంది, విజయవంతంగా కొనసాగుతోంది.చిన్నప్పుడు తను డాన్స్‌ చేస్తుంటే, చాలా మంది నువ్వు మంచి హీరోయిన్‌ అవుతావనేవారని.

నేనూ ఆ మాటను నమ్మేదాన్నని సృష్టి చెప్పుకొచ్చారు.కానీ, థియేటర్‌ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్న సమయంలోనే హీరోయిన్‌ కంటే ముందు మంచి నటిని కావాలనుకున్నా నని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతోన్న ‘గర్ల్స్‌ హాస్టల్‌’ సిరీస్‌తో సృష్టి శ్రీనివాస్తవ్… ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube