ధనుష్ ఐశ్వర్య లవ్ స్టోరీ గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది సెలబ్రిటీలు తొందరగా ప్రేమలో పడతారు.ఇలా ప్రేమలో పడిన కొన్ని జంటలు పెద్దల సమక్షంలో పెళ్లిళ్లు చేసుకొని గడుపుతున్నారు అనుకొనే సమయానికి బాంబు లాంటి వార్త చెబుతూ ఆశ్చర్యానికి గురి చేస్తారు.

 Do You Know These Things About Dhanush Aishwarya Love Story, Dhanush , Aishwarya, Kollywood, Film Industry, Love Story-TeluguStop.com

ఇటీవల కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సమంత నాగచైతన్య విడాకులు విషయాన్ని ప్రకటిస్తూ.అందరినీ షాక్ కి గురి చేశారు.

వీరి విడాకుల విషయం గురించి మర్చిపోకముందే తమిళ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో ధనుష్ ఐశ్వర్యలు విడాకులు తీసుకుని విడిపోతున్నట్లు ప్రకటించారు.

 Do You Know These Things About Dhanush Aishwarya Love Story, Dhanush , Aishwarya, Kollywood, Film Industry, Love Story-ధనుష్ ఐశ్వర్య లవ్ స్టోరీ గురించి మీకు ఈ విషయాలు తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇలా వీరిద్దరూ విడాకులు ప్రకటించడంతో రజనీకాంత్ తో పాటు అభిమానులు కూడా ఎంతో షాక్ అవుతూ వీరిద్దరూ విడిపోడానికి గల కారణాలు ఏంటి అనే సందేహాలు వ్యక్తపరుస్తున్నారు.

ఈ క్రమంలోనే వీరు పెళ్లి గురించి మరికొంతమంది ఆరా తీస్తున్నారు.ఇలా ఐశ్వర్య ధనుష్ ల వివాహం 2004 నవంబర్ 18 వ తేదీ ఈ జంట ప్రేమ వివాహాన్ని చేసుకున్నారు.

అయితే వీరిద్దరికీ ఎలా పరిచయం ఏర్పడిందనే విషయానికి వస్తే… ధనుష్ హీరోగా నటించిన కాదల్ కొండై సినిమా విడుదల సమయంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది.

ఈ సినిమా విడుదల సమయంలో ఐశ్వర్య థియేటర్ కి వెళ్లి సినిమాను చూసి వస్తుండగా ధనుష్ కి పరిచయం అయింది.అలా తన రెండవ సినిమాతోనే తనపై మనసు పారేసుకున్న ఐశ్వర్య తన ఇంటికి బొకే పంపించి టచ్ లో ఉండమని చెప్పింది.ఇలా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.

ఇలా ఒకరినొకరు ప్రేమించుకున్న వీరిద్దరూ వీరి ప్రేమ విషయాన్ని ఇరు కుటుంబాల సభ్యులకు తెలియజేయడంతో ఇరు కుటుంబ సభ్యులు వీరిద్దరి వివాహాన్ని ఎంతో వైభవంగా జరిపించారు.ఇలా 18 సంవత్సరాల పాటు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ దంపతులు ఇలా విడాకులు తీసుకోవడంతో విడాకులకు కారణాలు ఏంటి అని ఆరా తీస్తున్నారు.

Tamil Hero Dhanush And Aishwarya Rajinikanth Love Story

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube