ఈ ఆహారాల‌ వ‌ల్ల త‌ల‌నొప్పి వ‌స్తుంద‌ని మీకు తెలుసా?

త‌ల‌నొప్పి. పిల్ల‌ల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు ఏదో ఒక స‌మ‌యంలో ఎదుర్కొనే సాధార‌ణ స‌మ‌స్య ఇది.త‌ల‌నొప్పి చిన్న స‌మ‌స్యే అయినా.చాలా ఇబ్బందిక‌రంగా ఉంటుంది.

 Do You Know These Foods Cause Headache! Foods Cause Headache, Foods, Headache, L-TeluguStop.com

త‌ల‌నొప్పి వ‌స్తున్న స‌మ‌యంలో ఏదైనా ప‌ని చేస్తే.నొప్పి మ‌రింత ఎక్కువ అవుతుంది.

అప్పుడు వ‌చ్చే బాధ వర్ణనాతీతం.నిద్ర‌లేమి, ప‌ని ఒత్తిడి, ఆందోళన ఇలా అనేక కార‌ణంగా వ‌ల్ల త‌ల‌నొప్పి వ‌స్తుంది.

అయితే కొన్ని ఆహార ప‌దార్థాల వ‌ల్ల కూడా త‌ల‌నొప్పి వ‌స్తుంద‌ని మీకు తెలుసా? అవును కొన్ని ఆహార ప‌దార్థాల‌ను అధికంగా తీసుకోవ‌డం వ‌ల్ల త‌ల‌నొప్పి స‌మ‌స్య‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది.మ‌రి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉప్పు ఎక్కువ‌గా ఉన్న ఆహారాలు తీసుకోవ‌డం వ‌ల్ల కొంద‌రికి త‌ల‌నొప్పి వ‌స్తుంటుంది.ఎందుకంటే అందులో ఉండే సోడియం రక్తపోటు స్థాయిలను పెంచి.

త‌ల‌నొప్పిని క‌లిగిస్తుంది.

Telugu Foods, Foods Headache, Headache, Tips, Latest-

ఊరగాయలు మరియు పులియబెట్టిన ఆహారాల వ‌ల్ల కూడా త‌ల‌నొప్పి వ‌స్తుంటుంది.వేరుశెనగలు అధికంగా తీసుకున‌ప్పుడు కూడా కొంతమందిలో తలనొప్పిని కలిగిస్తుంది.ఎందుకంటే.

ఇందులో తలనొప్పికి కారణమయ్యే టైరమైన్ అధికంగా ఉంటుంది.ప్రాసెస్ చేసిన మాంసాలు తీసుకోవ‌డం వ‌ల్ల కూడా త‌ల‌నొప్పికి దారితీస్తుంది.

ప్రాసెస్ చేసిన మాంసాల్లో నైట్రేట్లు ఉంటాయి.ఇవి మెదడులోని రక్త నాళాలను విడదీసి.తలనొప్పిని రేకెత్తిస్తుంది.ఆల్కహాల్ తీసుకోవ‌డం వ‌ల్ల డీహైడ్రేషన్ ఏర్పడి త‌ల‌నొప్పికి దారితీస్తోంది.

అలాగే బీఫ్, కార్న్, పుట్టగొడుగులు, జున్ను, నువ్వులు వంటి ఆహారాలు మోతాదు మించి తీసుకోవ‌డం వ‌ల్ల కూడా త‌ల‌నొప్పి వ‌స్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube