చిరంజీవి ఇంట్లో తీసిన బాలకృష్ణ సినిమా బ్లాక్ బస్టర్ హిట్?

టాలీవుడ్ అగ్ర హీరోలలో మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణలు మొదటి రెండు స్థానాల్లో ఉంటారు.గత నలభై సంవత్సరాల నుండి టాలీవుడ్ ను ఒకరకంగా ఏలుతున్నారు అని చెప్పాలి.

 Do You Know These Facts About Chiranjeevi And Balakrishna Details, Balakrishna ,-TeluguStop.com

ఈ హీరోలకు సంబంధించినా మూవీ లు ఒకేసారి రిలీజ్ కు రెడీ అయితే అప్పుడు ఉండే మజానే వేరు.ఫ్యాన్స్ లో ఒక రకమైన పోటీ తత్వం ఏర్పడిపోతాయి.

మా హీరో అంటే మా హీరో సినిమా హిట్ అవ్వాలి అంటూ నానా రభస చేస్తారు.ఇదే విధంగా ఇప్పటి వరకు వీరిద్దరి నటించిన అన్నయ్య – వంశోద్ధారకుడు, స్నేహం కోసం – సమరసింహారెడ్డి, మృగరాజు – నరసింహనాయుడు పోటీ పడ్డాయి.

ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని రెండేళ్ల క్రిందట ఖైదీ నెంబర్ 150 – గౌతమీపుత్ర శాతకర్ణి పోటీగా వచ్చాయి.అయితే ఈసారి మాత్ర ఈ రెండు సినిమాలు వీరిద్దరికీ మంచి పేరును తీసుకురావడమే కాకుండా… తమ కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాలుగా పేరు తెచ్చుకున్నాయి.

రెండు సినిమాలు ఘనవిజయాన్ని సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద విజేతలుగా నిలిచాయి.కాగా ఒక సినిమా మాత్రం చిరంజీవి ఇంట్లో షూట్ చేయడం జరిగింది.ఈ విషయం ప్రేక్షకులకు తెలియకపోయి ఉండవచ్చు.బాలకృష్ణ, నిరోషా మరియు శోభన హీరో హీరోయిన్ లుగా నటించిన చిత్రం ‘నారీ నారీ నడుమమురారి’… ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికి 32 సంవత్సరాలు అయింది.

ఈ సినిమా రిలీజ్ అయ్యి ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది.ఈ సినిమాకు ఒక ప్రత్యేకత ఉంది.

బాలకృష్ణ కెరీర్ మొత్తంలో ఒక్క ఫైట్ కూడా లేకుండా సూపర్ హిట్ అయింది.అంతే కాకుండా ఈ సినిమా ప్రి క్లైమాక్స్ లో దాదాపు 20 నిముషాల వరకు హీరో కనిపించడు.

చిరంజీవికి తమిళనాడు లోనే వేలచ్చేరి లో హనీ హౌస్ అనే గెస్ట్ హౌస్ ఉండేది.అందులోనే ఈ సినిమా షూటింగ్ ను జరిపారు.

Telugu Balakrishna, Chiranjeevi, Goutamiputra, Khaidi Number, Naarinaari-Movie

ఆ విధంగా చిరంజీవి గెస్ట్ హౌస్ లో బాలకృష్ణ సినిమా తీసి సూపర్ హిట్ ను దక్కించుకున్నారు.నిజంగా ఈ విషయం గురించి తెలిస్తే ఫ్యాన్స్ చాలా హ్యాపీ ఫిల్ అవుతారు.కాగా ఈ సినిమాను ను డైరెక్ట్ చేసింది ఎవరో కాదు.చిరంజీవితో ప్రత్యేక అనుబంధం ఉన్న కోదండరామిరెడ్డి.చిరు మరియు కోదండరామిరెడ్డి కాంబినేషన్ లో 23 సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.ఇప్పటి వరకు ఇదే హైయెస్ట్ అని చెప్పాలి.

అందుకే డైరెక్టర్ కథకు ఇది సరిగ్గా సరిపోతుందని భావించి అడగ్గానే చిరంజీవి మారు మాట్లాడకుండా అందుకు ఒప్పుకున్నారు.ఇక ప్రస్తుతం టాలీవుడ్ ను దున్నేస్తున్న డైరెక్టర్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్, మరియు కీరవాణి తండ్రి శివశక్తి దత్త ఈ సినిమాకు కథను అందించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube