ఈ ఎగ్‌ కాఫీ రుచి చూశారా?

ప్రపం^è వ్యాప్తంగా ఎన్నో రెసిపీలు ఉన్నాయి.ఇప్పటికీ ఏదైన కొత్తదనం కమ్మదనంగా ఉంటే రుచి చూడాలని మన నాలుక తహతహలాడుతుంది.

 Do You Know The Vietnam's Egg Coffee Taste, Egg, Egg Yolk, Vietnam , Dark Roasted Coffee Powder, Egg Yokes, Condensed Milk, Egg Foam-TeluguStop.com

అది విదేశీ అయినా.స్వదేశీ అయినా.

అందులో ఏవైనా వెరైటీగా ఉన్న టేస్టీగా ఉన్నా.అది అందరినీ ఆకర్షిస్తుంది.

 Do You Know The Vietnam's Egg Coffee Taste, Egg, Egg Yolk, Vietnam , Dark Roasted Coffee Powder, Egg Yokes, Condensed Milk, Egg Foam-ఈ ఎగ్‌ కాఫీ రుచి చూశారా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎప్పడు దాని రుచి చూడాలో అని తహతహలాడతాం.ఇప్పుడు మనం తెలుసుకోబోయే రెసిపీ కూడా ఇటువంటిదే! అదే ఎగ్‌తో తయారు చేసిన కాఫీ.

అదేంటీ ఎగ్‌తోనా అని ఆశ్చర్యపోకండి.అదే నిజం! ఇది వియాత్నం దేశపు సాంప్రదాయ రెసిపీ.

దీన్ని మనం ఎప్పుడు కాంబైన్‌ చేయలేని పదార్థాలతో తయారు చేశారు.అయితే ఇప్పడు కాఫీని ఎలా తయారు చేయాలో వివరాలు తెలుసుకుందాం.

ఎగ్‌ యోక్‌తో వేయించిన కాఫీ గింజలతో తయారు చేస్తారు.ఇది చాలా డిలీషియస్‌గా, రిచ్, క్రీమీతోపాటు ఎక్కువ ప్రోటీన్లు కలిగి ఉంటుంది.

ఇటీవల ఈ రెసిపీ తయారీ విధానాన్ని ప్రముఖ చెఫ్‌ సారాంశ్‌ గోయల్‌ ఇన్‌స్టాగ్రాంలో షేర్‌ చేశారు.అతను వియాత్నం కాఫీని చాలా రోజుల తర్వాత ప్రిపేర్‌ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

కావాల్సిన పదార్థాలు

రెండు టేబుల్‌ స్పూన్ల డార్క్‌ రోస్టెడ్‌ కాఫీ పౌడర్, దీనికి వేడి నీరు కూడా అవసరం.దీంతోపాటు రెండు ఎగ్‌ యోక్స్‌ (దీనికి పాశ్చరైపజ్డ్‌ ఎగ్స్‌ బాగుంటాయి), రెండు టేబుల్‌ స్పూన్ల కండెన్సెడ్‌ మిల్క్, 8–10 డ్రాప్ల వెనీలా ఎసెన్స్‌.

తయారీ విధానం

కాఫీ ఫిల్టర్‌ను వేడినీటితో నింపి పది నిమిషాలపాటు పక్కన పెట్టాలి.ఆ తర్వాత ఓ గ్లాస్‌ లేదా మగ్‌ను హాట్‌వాటర్‌ బౌల్‌లో పెట్టాలి.మరో బౌల్‌లో ఎగ్‌ యోక్స్‌ను యాడ్‌ చేయాలి.ఆ తర్వాత అందులో కండెన్సెడ్‌ మిల్క్‌ కూడా వేయాలి.ఇందులోనే వెనీలా ఎసెన్స్‌ వేసి ఎగ్‌ బీటర్‌తో 10 నిమిషాలపాటు బాగా కలపాలి.అప్పుడు ఎగ్‌ ఫోమ్‌ రూపంలో అయ్యాక ఓ గ్లాస్‌ నీటికి ఓ డ్రాప్‌ వేసి చెక్‌ చేయాలి.

ఎగ్‌ ఫోం వాటర్‌పై తేలినట్లు ఉంటే కరెక్ట్‌ టెక్చర్‌ వచ్చినట్లు.మరో గ్లాస్‌లో ముందుగా కాఫీ పోయాలి.

ఆ తర్వాత కలిపిన ఎగ్‌ ఫోమ్‌ను వేయాలి.పైభాగంలో ఎగ్‌ ఫోంతో టాపింగ్‌ వేసుకోవాలి.

అంతే, ఎగ్‌ కాఫీ రెడీ అయినట్లే.మీకు కావాలిస్తే ఓ గ్లాస్‌లో కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube