పవన్ చేతికి ఉన్న వాచ్ విలువ ఎన్ని లక్షలో తెలుసా..?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న న‌ట‌న‌తో కోట్లాది మంది ప్రేక్ష‌క‌దేవుళ్ల‌ను సొంతం చేసుకున్న ఘ‌న‌త ఆయ‌నకే ద‌క్కుతుంది.మెగా బ్ర‌ద‌ర్స్ లో ఒక మెగాస్టార్, మ‌రొక‌రు నిర్మాత‌.

 Pawan Kalyan, Vakil Saab, Watch, 40 Lakhs, Metro Train, Mega Family, Pawn Kalyan-TeluguStop.com

అయినా స‌రే ఫ్యామిలీ స‌పోర్ట్ లేకుండా సోలోగా ప‌వ‌ర్ స్టార్ గా ఎదిగారు.అందుకు ఆయ‌న న‌ట‌న‌, మేన‌రిజమే నిలువెత్తు నిద‌ర్శ‌నం.

సినిమాల్లో , పాలిటిక్స్ లో ఆయ‌న ఎలా ఉన్నా, ఏం చేసినా సంచ‌ల‌నమే.సినిమాల్లో స్టెప్పేస్తే ఈలలు, రాజ‌కీయాల్లో స్పీచ్ ఇస్తే చ‌ప్ప‌ట్లు.ఇలా ప‌వ‌ర్ స్టార్ గురించి ఎంత‌ చెప్పినా త‌క్కువే.ముఖ్యంగా ఆయ‌న సాదార‌ణ జీవితం.

సిల్వ‌ర్ స్క్రీన్ పై స్టార్ హీరోలుగా చెలామ‌ణీ అవుతున్నా.స్పీచ్ ల‌లో నార్మ‌ల్ లైఫ్ బాగుంటుందని, హంగులు ఆర్భాల‌కు వెళ్ల‌కూడ‌దంటూ హిత‌బోధ చేస్తారు.

ప‌వ‌న్ క‌ల్యాణ్ సైతం అలాగే జీవిస్తుంటారు.సినిమాల్లో ఒక‌లా.,నార్మ‌ల్ లైఫ్ లో మ‌రోలా ఉంటారు.సినిమాలు లేక‌పోతే మూగ‌జీవాల‌తో సావాసం చేస్తూ పుస్త‌కాల‌తో కుస్తీ ప‌డుతుంటారు.

ఆ స‌మ‌యాల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ వేష‌దార‌ణ సింప్లిసిటీకి కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిస్తుంటారు.దీంతో అంద‌రూ ఆయ‌న్ని ఫాలో అవుతుంటారు.

కానీ ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ల్యాణ్ క్యాస్ట్యూమ్స్ పూర్తిగా మారిపోయిన‌ట్లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఫోటోల్ని చూస్తే షాక్ అవుతారంటూ ప‌లువురు నెటిజ‌న్లు కామెంట్ చేస్తున్నారు.ఎంతో సింపుల్ గా ఉండే ప‌వ‌న్.

,వ‌కీల్ సాబ్ షూటింగ్ లో భాగంగా మెట్రోలో ప్రయాణించారు.ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ ధ‌రించిన వాచ్ ధ‌ర రూ.40ల‌క్ష‌ల‌ని అంటున్నారు.అయితే దీనిపై ప‌లువురు ప‌వ‌న్ సింప్లిసిటీ అంటే ఇదేనా అని ప్ర‌శ్నిస్తున్నారు.

ప‌వ‌న్ అభిమానులు సైతం అదే రేంజ్ లో కౌంట‌ర్లు ఇస్తున్నారు.క్యాస్ట్యూమ్స్ సినిమా షూటింగ్ లో ఓ భాగ‌మ‌ని, క్యార‌క్ట‌ర్ కు త‌గ్గ‌ట్లు ఖ‌రీదైన వాచ్ లు ధ‌రించ‌డంలో త‌ప్పులేద‌ని, భూత‌ద్ధంలో చూడాల్సి అవ‌స‌రం లేదంటూ ప‌వ‌న్ కు అండ‌గా నిలుస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube