మన హిందూ పురాణాల ప్రకారం వేణుగోపాలస్వామి సత్యభామ గురించి ఎన్నో పురాణ కథలు ఉన్నాయి.ఈ క్రమంలోనే వేణుగోపాలస్వామి సత్యభామకి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుంటాము.
ఈ క్రమంలోనే పలుచోట్ల వేణుగోపాలస్వామి సత్యభామ సమేతంగా భక్తులకు దర్శనమిస్తూ ఉన్నటువంటి ఆలయాలు ఉన్నాయి.అలాంటి ఆలయాలలో చెప్పుకోదగిన ఆలయంగా పేరుగాంచినది చిత్తూరు జిల్లా, కార్వేటి నగరంలో సత్యభామసమేత వేణుగోపాల స్వామి ఆలయం.
ఈ ఆలయానికి ఒక విశిష్టత ఉంది.ఆ విశిష్టత ఏమిటి అనే విషయానికి వస్తే.
తిరుమల తిరుపతిలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీవారితో పాటు పూజలందుకొంటున్న రుక్మిణి, సత్యభామ, వేణుగోపాలస్వామి మూర్తులను కార్వేటి నగరానికి తెప్పించి వైఖానసులచే ప్రతిష్టించినట్టు పురాణాలు చెబుతున్నాయి.ఆలయ చరిత్ర విషయానికి వస్తే.
ఆకాశరాజు వంశానికి చెందిన నారాయణ రాజుకు సంతానం లేకపోవడంతో ఈ విగ్రహాలను ప్రతిష్టించి పూజలు చేశారని ఆ తర్వాత అతనికి సంతానం కలిగిందని పురాణాలు చెబుతున్నాయి.ఈ క్రమంలోనే ఆకాశరాజు వంశానికి చెందిన వెంకట పెరమాల రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది.
ఈ ఆలయంలో మకరతోరణం, గోమాత సహిత రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి విగ్రహాలను ఏకశిలతో రూపొందించడం విశేషం.అదేవిధంగా ఆలయ గాలి గోపురానికి ఎదురుగా ఉన్న 105 అడుగుల ధ్వజస్తంభం ఏకశిల నిర్మితం.ఈ ఆలయంలో 14 ఎకరాలలో స్కంద పుష్కరిణి ఉంటుంది.ఏ దిక్కున చూసినా ఇందులో నీటి మట్టం సమాంతరంగా ఉండడం ఈ ఆలయ విశిష్టత అని చెప్పవచ్చు.
ఇక్కడ ఉన్నటువంటి చెరువు కూడా ఎంతో ప్రత్యేకత ఉంది ఈ చెరువు నుంచి నీరు చేరుతుంది అలాగే ఆ బావుల నుంచి నీరు స్కంద పుష్కరిణి చేరుతుందని స్థానికులు చెబుతుంటారు.
DEVOTIONAL