కేజీఎఫ్ కథ నిజంగా జరిగిందా.. గతంలో అంత దారుణమైన పరిస్థితులు నిజంగా ఉండేవా?

కేజీఎఫ్ ఛాప్టర్1 సినిమా చూసిన వాళ్లలో చాలామందికి ఈ సినిమా కథ నిజంగా జరిగిందా అనే సందేహం కలిగింది.

ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో కేజీఎఫ్ తెరకెక్కగా భూమిలో దాగి ఉన్న బంగారంను బయటకు తీయడం కొరకు కార్మికులు పడే కష్టాలను, బంగారు సామ్రాజ్యానికి అధిపతి కావడానికి కొంతమంది వ్యక్తులు చేసే ప్రయత్నాలను ఈ సినిమాలో ప్రధానంగా చూపించారు.

ఈ నెల 14వ తేదీన కేజీఎఫ్2 థియేటర్లలో విడుదల కానుంది.వేల సంవత్సరాల క్రితం నుంచి కోలార్ లో బంగారం గనులు ఉన్నాయి.

బ్రిటిష్ వాళ్లు అధికారంలో ఉన్న సమయంలో బ్రిటిష్ గవర్నర్ జాన్ వారెన్ కు కోలార్ మట్టిలో బంగారం ఉందని తెలిసింది.ఆ తర్వాత గ్రామస్థుల సహాయసహకారాలతో మట్టి తవ్వకాలు మొదలయ్యాయి.అయితే మట్టిలో తక్కువ మొత్తంలో బంగారం ఉండటంతో ఆ ప్రయత్నాలు ఆగిపోయాయి.1850 సంవత్సరంలో బ్రిటిష్ అధికారి అయిన లావెల్లీ జాన్ టేలర్ కంపెనీ సహాయంతో బంగారం తవ్వకాలను మళ్లీ మొదలుపెట్టారు.

అయితే ఇక్కడ బంగారం గనులు అంతరించిపోవడం వల్ల 2001 సంవత్సరంలో ఇక్కడ తవ్వకాలు పూర్తిగా ఆగిపోయాయి.ఒక సందర్భంలో చిత్రయూనిట్ స్పందిస్తూ ఈ సినిమా కథ కల్పితమని వెల్లడించింది.అప్పటి కేజీఎఫ్ కు ఈ సినిమాకు ఎటువంటి సంబంధం లేదని చిత్రయూనిట్ తేల్చి చెప్పడం గమనార్హం.

Advertisement

కేజీఎఫ్ ఛాప్టర్1 అంచనాలను మించి విజయం సాధించగా కేజీఎఫ్ ఛాప్టర్2 సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది.కేజీఎఫ్ ఛాప్టర్2 బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.

ఈ సినిమా ట్రైలర్ కు రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి.యశ్, ప్రశాంత్ నీల్ కెరీర్ లో ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు