అయోధ్య‌ రామ మందిర నిర్మాణానికి అయ్యే మొత్తం ఖ‌ర్చు ఎంతో తెలుసా.. ?  

How Much Will Ram Mandir In Ayodhya Cototal construction, cost, Ayodhya, Rama Mandir - Telugu Ayodhya, Cost, Rama Mandir, Total Construction

ప్రతి హిందువు కల అయినా అయోధ్య‌లో రామ మందిర నిర్మాణానికి విరాళాల సేకరణ ఇప్పటికే మొదలైందన్న విషయం తెలిసిందే.ఈ నేపధ్యంలో ఎందరో తమకు తోచినంత విరాళాలు సమర్పించుకుంటున్నారు.

TeluguStop.com - Do You Know The Total Construction Cost Of Ayodhya Rama Mandir

అయితే అసలు రామ మందిర నిర్మాణాని అయ్యే ఖర్చు ఎంతో తెలిస్తే షాకవడం ఖాయం.ఎందుకంటే అక్షరాల రూ.1100 కోట్ల దాటుతుంద‌ని రామ జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర ట్ర‌స్ట్‌ కోశాధికారి, స్వామి గోవింద్ దేవ్ గిరి వెల్ల‌డించారట.ఇక మూడు నుంచి మూడున్న‌రేళ్ల‌లో పూర్త‌వుతుంది.

మొత్తం 70 ఎక‌రాలలో అందంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ ఆలయ నిర్మాణం జరుగుతుందని చెబుతున్నారు.

TeluguStop.com - అయోధ్య‌ రామ మందిర నిర్మాణానికి అయ్యే మొత్తం ఖ‌ర్చు ఎంతో తెలుసా.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇకపోతే ఈ ఆల‌య నిర్మాణంలో పాలుపంచుకుంటున్న నిపుణుల‌తో మాట్లాడిన త‌ర్వాతే ఇంత మొత్తం అవుతుంద‌ని తాను అంచ‌నా వేసిన‌ట్లు గోవింద్ దేవ్ గిరి పేర్కొన్నారు.

కాగా ఈ ఖర్చు విషయంలో ఆలయ ట్ర‌స్ట్ మాత్రం అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌నా చేయ‌లేద‌ట.

ఇదిలా ఉండగా చాలా మంది సంపన్న కుటుంబాల వాళ్లు ఆల‌య డిజైన్లు ఇవ్వండి, మేమే నిర్మిస్తామ‌ని ముందుకు వస్తున్నారని, కానీ ఈ ప్రతిపాదనకు తాము అంగీకరించడం లేదంటున్నారు.ఇక విరాళాల సేకరణ సందర్భంగా తాము 6.5 ల‌క్ష‌ల గ్రామాల‌కు, మొత్తం 15 కోట్ల ఇళ్ల‌కూ చేరుకోవాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్లు చెప్పడం విశేషం.

#Ayodhya #Cost #Rama Mandir

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు