వినాయకుడు దొంగతనం చేయడానికి గల కారణం ఏమిటో మీకు తెలుసా?

మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఏదైనా శుభకార్యం తలపెట్టినా, ఏదైనా మంచి పనులు చేయాలని భావించిన ముందుగా వినాయకుడికి పూజలు చేస్తాము.ఈ విధంగా వినాయకుడికి పూజ చేయటం వల్ల ఆ కార్యానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా దిగ్విజయంగా పూర్తవుతుందని భావిస్తారు.

 Do You Know The The Reason Why Ganesha Stole-TeluguStop.com

ఎంతో విశిష్టత కలిగిన ఈ గణనాథుడు కూడా దొంగతనం చేశాడంటే మీరు నమ్ముతార వినడానికి ఆశ్చర్యంగా ఉన్న వినాయకుడి కూడా దొంగతనం చేశాడని పురాణాలు చెబుతున్నాయి.మరి వినాయకుడు దొంగతనం చేయడానికి గల కారణం ఏమిటి? అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

పురాణాల ప్రకారం పూర్వం దేవతలు, రాక్షసులు అమృతం కోసం సాగర మధనం చేస్తుంటారు.ఈ మహత్తర కార్యం మొదలు పెడుతున్న సమయంలో దేవతలు రాక్షసులు వినాయకుడికి పూజ చేయటం మరిచిపోయారు.

 Do You Know The The Reason Why Ganesha Stole-వినాయకుడు దొంగతనం చేయడానికి గల కారణం ఏమిటో మీకు తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గణనాధుడు సముద్రగర్భం నుంచి ఉద్భవించిన ఒక బిందెడు అమృతాన్ని దొంగలించి తమిళనాడు రాష్ట్రం, నాగపట్నం జిల్లా తిరుక్కాడియాయూర్ లో ఉన్నటువంటి కడేశ్వరస్వామి ఆలయంలో దాచారు.ఈ విధంగా వినాయకుడు దొంగలించి దాచిపెట్టిన అమృతం బిందె మహా శివలింగంగా ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి.

Telugu Ganesha, Ganesha Stole, Hindu Tradition, Nagapattinam Dirstrict, Sagara Madhnam, Worship-Telugu Bhakthi

ఈ విధంగా ఈ ఆలయంలోని స్వామి వారు అమృతం నుంచి ఉద్భవించాడు కనుక ఈ ఆలయంలో వెలసిన స్వామివారిని అమృత కడేశ్వరుడిగా భక్తులు పూజ చేస్తున్నారు.ఈ క్రమంలోనే సముద్రగర్భం నుంచి అమృతాన్ని దొంగలించినందుకుగాను వినాయకుడికి కళ్ళల్ వినయగర్ అనే పేరు వచ్చింది.ఇక్కడ కళ్ళల్ అంటే దొంగ అని అర్ధం.అదేవిధంగా యమధర్మరాజు నుంచి మార్కండేయుడిని కాపాడటం కోసం పరమశివుడు ఏకంగా యమధర్మరాజును సంహరించడం వల్ల ఈ ఆలయంలో వెలసిన స్వామివారిని కాల సంహారకుడు అని పిలుస్తారు.

ప్రతి ఏడు ఈ ఆలయంలో స్వామి వారికి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.ముఖ్యంగా కార్తీకమాసం, దసరా, శివరాత్రి వంటి పర్వదినాలలో ఈ ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు చేరుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు.

#Sagara Madhnam #Ganesha Stole #Ganesha #Hindu Tradition #Worship

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU