మూడు భాషల్లో సూపర్ హిట్ అయిన రాజశేఖర్ సినిమా ఏదో తెలుసా?

Do You Know The Super Hit Rajasekhar Movie In Three Languages

మామూలుగా మంచి మంచి హిట్ లు అందుకున్న సినిమాలు వేరే భాషలలో రీమేక్ గా తెరకెక్కిస్తే ఆ సినిమా ఎందుకో అంత సక్సెస్ కాలేకపోతోంది.ఒకటే కథను ఎటువంటి మార్పులు లేకుండా తీసుకున్న కూడా కొన్ని కొన్ని సార్లు సినిమా నిరాశపరుస్తుంది.

 Do You Know The Super Hit Rajasekhar Movie In Three Languages-TeluguStop.com

కానీ కొన్ని సినిమాలు మాత్రం ఒక భాష నుండి ఎటువంటి సక్సెస్ అందుకుందో ఇతర భాషలలో కూడా అంతే సక్సెస్ సొంతం చేసుకుంటుంది.అలా హీరో రాజశేఖర్ నటించిన సినిమా కూడా అటువంటి సక్సెస్ నే అందుకుంది.

తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు డాక్టర్ రాజశేఖర్ గురించి, ఆయన నటన గురించి అందరికీ తెలిసిందే.కేవలం తెలుగులోనే కాకుండా తమిళ సినిమాలలో కూడా నటించి మంచి అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.

 Do You Know The Super Hit Rajasekhar Movie In Three Languages-మూడు భాషల్లో సూపర్ హిట్ అయిన రాజశేఖర్ సినిమా ఏదో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూ తన కూతురు లతో సహా పోటీగా సినిమాలలో నటిస్తున్నాడు.ఇదిలా ఉంటే ఈయన నటించిన సూపర్ హిట్ మూవీ మరో రెండు భాషలలో కూడా సూపర్ హిట్ గా నిలిచింది.

ఇంతకూ ఆ సినిమా ఏంటో తెలుసుకుందాం.

రాజశేఖర్ తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి 1985లో వందేమాతరం సినిమాతో పరిచయం అయ్యాడు.

ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో అదే ఏడాది ప్రతిఘటన సినిమాలో నటించాడు.ఆ తర్వాత ఏడాదికి వరుస సినిమాలతో వెనుతిరిగి చూడకుండా ఓ రేంజ్ లో దూసుకెళ్ళాడు.

రాజశేఖర్ మాస్ పాత్రకైనా, క్లాస్ పాత్రకైనా ప్రాణం పోసినట్లే నటిస్తాడు.

Telugu Blockbuster, Raja Sekhar, Ma Annaya, Rajasekhar, Rajasekharmaa, Languages, Tollywood-Movie

అలా ఇప్పటికి ఎన్నో పాత్రలలో నటించి స్టార్ హోదా ను సంపాదించుకున్నాడు.ఈయన నటించిన సినిమాలన్నీ చాలా వరకు మంచి సక్సెస్ను అందుకున్నాయి.ఎక్కువగా కుటుంబ నేపథ్యంలో వచ్చిన సినిమాలలో మాత్రమే నటిస్తాడు రాజశేఖర్.

ఇక ఈయన 2001 లో నటించిన ‘మా అన్నయ్య’ సినిమా ఎంత సక్సెస్ అందుకుందో చూశాం.

Telugu Blockbuster, Raja Sekhar, Ma Annaya, Rajasekhar, Rajasekharmaa, Languages, Tollywood-Movie

సినిమాకు రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించాడు.ఇందులో రాజశేఖర్ సరసన మీనా నటించింది.ఈ సినిమాను డైరెక్టర్ రవి రాజా.

తమిళ సినిమా అయిన‘వనాథైపోలా’ నుండి రీమేక్ గా తెరకెక్కించారు.ఈ సినిమా 2000 సంవత్సరంలో విడుదలయింది.

ఇక ఈ సినిమా తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

Telugu Blockbuster, Raja Sekhar, Ma Annaya, Rajasekhar, Rajasekharmaa, Languages, Tollywood-Movie

సినిమాకు విక్రమ్ అండ్ దర్శకత్వం వహించాడు.ఇక ఇదే సినిమా కన్నడలో ‘యజమాన’ పేరుతో విడుదలయింది.ఇక ఈ సినిమా కూడా కన్నడంలో మంచి హిట్ అందుకుంది.

వరుస ఏడాదిలలో ఈ సినిమాలు వరుసగా విడుదలైనా కూడా ప్రేక్షకులను బోర్ కొట్టకుండా మెప్పించింది.దీంతో ఈ సినిమాలలో నటించిన హీరోలకు మంచి గుర్తింపు కూడా వచ్చింది.

ఇక తెలుగు హీరో రాజశేఖర్ కు మాత్రం ఈ సినిమా నుండి వచ్చిన సక్సెస్ అంతా ఇంతా కాదు.ఎందుకంటే అప్పటికే వరుస సినిమాలతో నిరాశలో ఉన్న రాజశేఖర్సినిమా తమిళంలో విడుదల అవటంతో వెంటనే తెలుగు రీమేక్ కు ఒప్పుకొని మంచి సక్సెస్ అందుకున్నాడు.

ఆ తర్వాత కూడా వరుస సినిమాలలో అవకాశాలు అందుకున్నాడు.

#Languages #Rajasekhar #Raja Sekhar #Blockbuster #Annaya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube