ముగ్గురు కొడుకులు సినిమా వెనుక ఎంత పెద్ద కథ ఉందో తెలుసా?

సూపర్ స్టార్ కృష్ణ మాతృమూర్తి నాగరత్నం గారికి ముగ్గురు కొడుకులు.కృష్ణ, హనుమంతరావు, ఆదిశేషగిరి రావు.

 Do You Know The Story Behind The Krishna Mugguru Kodukulu Movie Details,  Muggur-TeluguStop.com

అందుకే ముగ్గురు కొడుకులు అనే సినిమా తీయాలని ఆమె కోరిక.అందుకే ఆ కథ కూడా సిద్ధం కాకుండానే టైటిల్‌ను రిజిస్టర్ చేయించారు.

ఆ సినిమా కోసం ఒక కథ తయారు చేయాలని పద్మాలయ సంస్థ మహారధికి చెప్పారు నాగరత్నం.అలా చెప్పినప్పటికీ ఆయన మాత్రం మాటలతో కాలక్షేపం చేస్తున్నారు తప్ప ఏడాది గడిచినా కథ తయారు చేయలేదు మహారధి.

ఆయన చెప్పే కబుర్లు విని విని విసుగెత్తిపోయి, ఒక రోజు ఆమె సీరియస్‌గా హీరో కృష్ణ దగ్గరికి  వెళ్లి,  కథ తయారు చేయమని ఏడాది అయింది కానీ అక్షరం ముక్క కూడా రాయలేదు.ఆ సినిమా కథ గురించి ఈ రోజు ఖచ్చితంగా తేలాల్సిందే అని గట్టిగా చెప్పేశారు నాగరత్నం.

అయితే కృష్ణకు అమ్మ అంటే చాలా ఇష్టం.కాబట్టి అమ్మా.

నువ్వేం టెన్షన్ పడకు.ఆ కథను పరుచూరితో రాయిస్తా అని చెప్పారట కృష్ణ.

ఆ తర్వాత పరుచూరి సోదరులను సంప్రదించి తమ ముగ్గురు అన్నదమ్ముల నేపథ్యంలో కథ సిద్ధం చేయమని కృష్ణ చెప్పారు.దాంతో వారు కొన్ని రోజుల్లోనే కథను తయారు చేసి వారికి వినిపించగా, అది కృష్ణకు నచ్చలేదట.

ఆ సమయంలోనే దర్శకుడు పి.సి.రెడ్డి ఓ లైన్‌ చెప్పడం, అది కృష్ణకు నచ్చడంతో పి.సి.రెడ్డి, రచయిత వి.శెట్టి కలిసి కథ తయారు చేశారు.ఊటీ బ్యాక్‌డ్రాప్‌లో సిద్దం చేసిన ఈ కథకు పరుచూరి బ్రదర్స్ మాటలు రాయగా, కృష్ణ సరసన రాధ నటించారు.

Telugu Hanumantha Rao, Krishna Mother, Krishnamugguru, Story, Tollywood-Movie

ఇకపోతే ఈ సినిమా షూటింగ్ అంతా కూడా ఊటిలోనే జరిగింది.కృష్ణతో తన సోదరులిద్దరితో కలిసి నటించిన మొదటి చిత్రం ఇదే.అలాగే కృష్ణ కుమార్తె బేబీ ప్రియ కూడా ఈ చిత్రంలో నటించారు.ఇదిలా ఉండగా నిర్మాతగా నాగరత్నం పేరే వేయించారు కృష్ణ.తను ఎంతో ముచ్చట పడి తీయించిన ఈ చిత్రం హిట్ అవడంతో ఆమె చాలా సంతోషించారట.కానీ ఈ సినిమా 100రోజుల వేడుకలో పాల్గొనకుండా ఆమె కన్నుమూయడం విషాదకరం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube