వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటో తెలుసా?  

తెలుగు మాసాలలో ఒకటైన మార్గశిరమాసం ఆ విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనది.ఈ మార్గశిర మాసంలో విష్ణుభగవానుడు ప్రత్యేక పూజలు అందుకుంటాడు.

TeluguStop.com - Do You Know The Significance Of Vaikuntha Ekadashi

మార్గశిర మాసం మధ్యలో ధనుర్మాసం మొదలవుతుంది.శ్రీరంగనాథుని అవతారంలో ఉన్న శ్రీహరిని గోదాదేవి తన భక్తితో పూజించి ఆ శ్రీహరిని తన భర్తగా పొందుతుంది.

పుష్యమాసంలో వచ్చే ఏకాదశి రోజు విష్ణుమూర్తికి ఎంతో పరమ పవిత్రమైనదిగా భావిస్తారు.ఈ నెలలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు.

TeluguStop.com - వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటో తెలుసా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఈ వైకుంఠ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు.ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఆ శ్రీహరిని దర్శించుకోవడానికి ఉత్తరద్వారం తెరుస్తారు.

ఆ విధంగా ఉత్తర ద్వారంలో శ్రీహరిని దర్శించుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం…

సంవత్సరానికి వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులలో ఈ ఏకాదశి ఎంతో ప్రత్యేకమైనది.సూర్యుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణానికి మారేటప్పుడు వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా పిలుస్తారు.

ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఆ శ్రీహరిని దర్శించుకోవడానికి ఉత్తరద్వారం తెరుస్తారు.ఈ ద్వారం గుండా వెళ్లి స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున ఆరాటపడుతుంటారు.

ఈ వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని, స్వర్గద్వార ఏకాదశి అని పిలుస్తారు.

సాక్షాత్తు ఆ మహావిష్ణువు కొలువై ఉన్న వైకుంఠం వాకిళ్ళు ఈరోజు తెరవటం వల్ల ఈ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు.అంతేకాకుండా ఆషాడ శుద్ధ ఏకాదశి రోజు సముద్రంలో పవళించిన శ్రీమన్నారాయణుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటాడు.ఈ విధంగా మేల్కొన్నశ్రీమన్నారాయణుని దర్శించుకోవడానికి మార్గశిర శుక్లపక్ష ఏకాదశి రోజు ముక్కోటి దేవతలందరూ కలిసి ఆ శ్రీమన్నారాయణ దర్శనానికి వెళ్తారు.

కాబట్టి ఈ రోజును ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు.దక్షిణాయనం ప్రారంభం కావడం వల్ల ఇప్పుడు చనిపోయినవారు స్వర్గానికి వెళ్తారని ఈ ఏకాదశినీ స్వర్గద్వార ఏకాదశి అని కూడా పిలుస్తారు.

ఈ విధంగా ముక్కోటి ఏకాదశిని ఎంతో ఘనంగా భక్తి శ్రద్ధలతో ఆ శ్రీమన్నారాయణుని పూజిస్తారు.

#SignificanceOf

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు