వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటో తెలుసా?

Do You Know The Significance Of Vaikuntha Ekadashi

తెలుగు మాసాలలో ఒకటైన మార్గశిరమాసం ఆ విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనది.ఈ మార్గశిర మాసంలో విష్ణుభగవానుడు ప్రత్యేక పూజలు అందుకుంటాడు.

 Do You Know The Significance Of Vaikuntha Ekadashi-TeluguStop.com

మార్గశిర మాసం మధ్యలో ధనుర్మాసం మొదలవుతుంది.శ్రీరంగనాథుని అవతారంలో ఉన్న శ్రీహరిని గోదాదేవి తన భక్తితో పూజించి ఆ శ్రీహరిని తన భర్తగా పొందుతుంది.

పుష్యమాసంలో వచ్చే ఏకాదశి రోజు విష్ణుమూర్తికి ఎంతో పరమ పవిత్రమైనదిగా భావిస్తారు.ఈ నెలలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు.

 Do You Know The Significance Of Vaikuntha Ekadashi-వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటో తెలుసా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వైకుంఠ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు.ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఆ శ్రీహరిని దర్శించుకోవడానికి ఉత్తరద్వారం తెరుస్తారు.

ఆ విధంగా ఉత్తర ద్వారంలో శ్రీహరిని దర్శించుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం…

సంవత్సరానికి వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులలోఏకాదశి ఎంతో ప్రత్యేకమైనది.సూర్యుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణానికి మారేటప్పుడు వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా పిలుస్తారు.

వైకుంఠ ఏకాదశి రోజు ఆ శ్రీహరిని దర్శించుకోవడానికి ఉత్తరద్వారం తెరుస్తారు.ఈ ద్వారం గుండా వెళ్లి స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున ఆరాటపడుతుంటారు.

వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని, స్వర్గద్వార ఏకాదశి అని పిలుస్తారు.

సాక్షాత్తు ఆ మహావిష్ణువు కొలువై ఉన్న వైకుంఠవాకిళ్ళు ఈరోజు తెరవటం వల్ల ఈ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు.అంతేకాకుండా ఆషాడ శుద్ధ ఏకాదశి రోజు సముద్రంలో పవళించిన శ్రీమన్నారాయణుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటాడు.ఈ విధంగా మేల్కొన్నశ్రీమన్నారాయణుని దర్శించుకోవడానికి మార్గశిర శుక్లపక్ష ఏకాదశి రోజు ముక్కోటి దేవతలందరూ కలిసి ఆ శ్రీమన్నారాయణ దర్శనానికి వెళ్తారు.

కాబట్టి ఈ రోజును ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు.దక్షిణాయనం ప్రారంభం కావడం వల్ల ఇప్పుడు చనిపోయినవారు స్వర్గానికి వెళ్తారని ఈ ఏకాదశినీ స్వర్గద్వార ఏకాదశి అని కూడా పిలుస్తారు.

ఈ విధంగా ముక్కోటి ఏకాదశిని ఎంతో ఘనంగా భక్తి శ్రద్ధలతో ఆ శ్రీమన్నారాయణుని పూజిస్తారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube