హిందూ ధర్మశాస్త్రంలో గుడ్లగూబ ప్రాధాన్యత ఏమిటో తెలుసా?

Importance Of Owl According To The Hindu Dharma, Hindu Dharma Shastra, Owl, Mahalakshmi, Hindu Traditions, Good Luck, Hindu Rituals, Farmer Friends

గుడ్లగూబ ఈ పేరు వినగానే చాలామంది ఒక అపశకునంగా భావిస్తారు.ప్రస్తుతం అంతరించిపోతున్న జాతులలో గుడ్లగూబ ఒకటని చెప్పవచ్చు.

 Importance Of Owl According To The Hindu Dharma, Hindu Dharma Shastra, Owl, Maha-TeluguStop.com

పెద్ద పెద్ద కళ్ళు చూడగానే భయంకరంగా కనిపించే ఈ పక్షిని చూడగానే చాలా మంది అపశకునంగా భావిస్తారు.ఈ పక్షి అరుపు కూడా ఎంతో భయంకరంగా ఉంటుంది.

ఈ పక్షి ఎవరి ఇంటి పై వాలితే ఆ ఇంట్లో కీడు జరుగుతుందని, చావు వార్త వినాల్సి వస్తుందని చాలా మంది భావిస్తుంటారు.అయితే పక్షులలో ఎంతో విభిన్నంగా ఉండే ఈ గుడ్లగూబ రైతులకు మాత్రం ఎంతో నేస్తాలు.

పంటలను పాడు చేసే అనేక కీటకాల నుంచి పంటను రక్షించడంలో గుడ్లగూబలు ఎంతో సహాయం చేస్తాయి.ఈ విధంగా గుడ్లగూబ గురించి చాలామందికి చెడు అభిప్రాయం కలిగి ఉంది.

కాని,మన హిందూ సాంప్రదాయాల ప్రకారం పురాణాలలో గుడ్లగూబకు ఎలాంటి ప్రాధాన్యత ఉందో ఇక్కడ తెలుసుకుందాం…

హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం గుడ్లగూబకు మించిన శుభ శకునం మరొకటి లేదని శాస్త్రం చెబుతోంది.గుడ్లగూబ సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి వాహనంగా భావిస్తారు.

ఈ మహాలక్ష్మి అమ్మవారు స్వామి వారితో కలిసి ప్రయాణం చేయాల్సి వస్తే గరుడవాహనంపై ప్రయాణిస్తారు.అదేవిధంగా ఒంటరిగా ప్రయాణం చేయాల్సి వస్తే గుడ్లగూబను తన వాహనంగా ఉపయోగించుకుంటారు.

కనుక గుడ్లగూబ శుభశకునంగా మన హిందూ ధర్మ శాస్త్రం చెబుతోంది.

Telugu Friends, Luck, Hindudharma, Hindu Rituals, Hindu, Mahalakshmi-Telugu Bhak

అదేవిధంగా ఇక ఉల్లూక తంత్రం ప్రకారం నాల్గో జాములో గుడ్లగూబ ఎవరి ఇంటిపై వాలితే ఆ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతూ ఉంది.ఇక ఎవరైనా ఏదైనా ముఖ్యమైన పని నిమిత్తం ప్రయాణాలు చేస్తున్నప్పుడు గుడ్లగూబ ఎడమ వైపు ఉంటే కచ్చితంగా వారు వెళ్ళిన పని ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా పూర్తి అవుతుందని చెప్పవచ్చు.ఏ ఇంటి ఆవరణంలో గుడ్లగూబ నివసిస్తుంది ఆ ఇంటి యజమానితో సహా కుటుంబ సభ్యులందరూ ఎంతో సంతోషంగా ఉంటారనీ హిందూ ధర్మ శాస్త్రం గుడ్లగూబను ఒక శుభశకునంగా తెలియజేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube