నైరుతి దిశలో తరుచు కాకి అరిస్తే దేనికి సంకేతమో తెలుసా?

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం కాకిని కొన్ని కార్యక్రమాలకు పవిత్రంగా భావిస్తారు.ఏదైనా పిండ ప్రధాన కార్యక్రమాలు చేస్తున్న సమయంలో కాకిని పవిత్రంగా భావిస్తారు.

 Do You Know The Sign Of A Crow Often Burning In The Southwest Crow, Signel, South, Money, Kubharudu, Southwest-TeluguStop.com

కానీ కొన్ని సమయాలలో అశుభంగా భావిస్తారు.ఈ క్రమంలోనే కాకి మన ఇంట్లోకి వస్తే అశుభంగా భావిస్తారు.

ఎందుకంటే కాకి శనీశ్వరుడి వాహనం కనుక మనకు శని ప్రభావం ఉంటుందని భావిస్తూ కొందరు శాంతి పూజలు చేయిస్తారు.అదేవిధంగా తరచూ కాకి వచ్చి మనల్ని తాకిన, అశుభంగా భావించి వెంటనే స్నానం చేయడం చూస్తుంటాము.

 Do You Know The Sign Of A Crow Often Burning In The Southwest Crow, Signel, South, Money, Kubharudu, Southwest-నైరుతి దిశలో తరుచు కాకి అరిస్తే దేనికి సంకేతమో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే కొన్ని సార్లు మన ఇంటి మేడపై లేదా ఇంటి చుట్టు కాకులు తరుచు అరుస్తూ ఉంటాయి.ఇలా అరవడం వల్ల మన ఇంటికి ఏదైనా అశుభం జరుగుతుందని కొందరు భావిస్తుంటారు.

మరి కొందరు మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తారని చెబుతారు.అలాగే మరి కొందరు మన ఇంటికి పితృదేవతలు వచ్చారని భావించి కాకులకు ఆహారం పెడుతుంటారు.

అయితే కాకుల అరుపులలో కూడా ఎన్నో రకాల సంకేతాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు.ముఖ్యంగా కాకి మన ఇంటి నైరుతి దిశ వైపు అరవడం వల్ల ఎంతో శుభం జరుగుతుందని పండితులు చెబుతున్నారు.

నైరుతి దిశ అంటే కుబేరుడికి అనువైన స్థానం.కనుక నైరుతి దిశ సిరిసంపదలకు మంచిదని భావిస్తారు.ఇక కాకి మన ఇంటి మేడపై లేదా మన ఇంటి కాంపౌండ్ లో నైరుతి దిశలో ఉండి తరచు అరవడం వల్ల మన ఇంటికి ఆకస్మిక ధన లాభం కలుగుతుందని అర్థం.ఇలా కాకి నైరుతిదిశలో అరిస్తే ఆ ఇంటికి ధన ప్రవాహం కలిగి ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటుందని పండితులు చెబుతున్నారు.

Do You Know The Sign Of A Crow Often Burning In The Southwest Crow, Signel, South, Money, Kubharudu, Southwest - Telugu Crow, Devotional, Kubharudu, Signel, Southwest

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube