పద్మ అవార్డుల ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుందో తెలుసా?

మొన్న గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 128 మంది పేర్లతో కూడిన పద్మ అవార్డులు- 2022ను ప్రకటించింది.పద్మ అవార్డులకు ఎంపిక చేసే ప్రాతిపదిక ఏమిటో మీకు తెలుసా? కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న పద్మ అవార్డుల వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించిన వివ‌రాలున్నాయి.కళలు, సాహిత్యం, విద్య, సైన్స్, ఇంజినీరింగ్, ప్రజా వ్యవహారాలు, క్రీడలు, సామాజిక సేవ, వైద్యం, పౌర సేవ, వాణిజ్యం మరియు పరిశ్రమలతో సహా అనేక రంగాలలో విశిష్టమైన మరియు అసాధారణమైన సేవ‌లు అందించిన వారికి పద్మ అవార్డులు ఇవ్వబడతాయి.ఈ అవార్డుల ఎంపికలో ఎక్సలెన్స్ అనేది ప్రధానాంశం.

 Do You Know The Selection Process For The Padma Awards Knowledge People Human Se-TeluguStop.com

పద్మ అవార్డుల పేర్లను పరిశీలించేందుకు ప్రధాని ప్రతి సంవత్సరం ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు.ప్రధానమంత్రి ఏర్పాటు చేసిన పద్మ అవార్డుల కమిటీకి కేబినెట్ సెక్రటరీ నేతృత్వం వహిస్తారు.

ఈ కమిటీలో కేంద్ర కేబినెట్ కార్యదర్శి, రాష్ట్రపతి కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, కొంద‌రు ప్రముఖులు ఉంటారు.పద్మ అవార్డుల కోసం వచ్చిన అన్ని నామినేషన్లను పద్మ అవార్డుల కమిటీ ముందు ఉంచుతారు.

దీని తర్వాత, ఈ సిఫార్సులను ఆమోదం కోసం ప్రధాని, హోం మంత్రి మరియు రాష్ట్రపతి ముందుకు తీసుకువెళతారు.వారు దీనిపై ఆమోదం తెలుపుతారు.

ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే సందర్భంగా ఈ గౌరవాలను ప్రకటిస్తారు.

Do You Know The Selection Process For The Padma Awards Knowledge People Human Service , Padma Awards, People , Selection - Telugu Padma Awards

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube