ఈ ప్రపంచంలోని దేశాలు ప్రజాస్వామ్యం అమలులోకి రాకమునుపు రాజులు, రాజకుటుంబాల పాలనలో ఉండేవి.అయితే ప్రస్తుతం ఆ యుగం దాదాపుగా పరిసమాప్తమైంది.
అయితే ఓ రాజకుటుంబం దర్పం, దర్బార్ ఇప్పటికీ అలాగే ఉంది.అనేక దేశాలను పాలించిన బ్రిటిష్ రాజకుటుంబం( British Royal Family ) ప్రపంచంలోనే అత్యంత రాజకుటుంబంగా చెప్పుకుంటూ వుంటారు.
కానీ, ప్రస్తుతం దానికి కూడా కాలం చెల్లింది.ప్రపంచంలోనే అత్యంత ధనిక రాజకుటుంబంగా ఇపుడు ‘ది రాయల్ ఫ్యామిలీ ఆఫ్ సౌదీ’ని( The Royal Family of Saudi ) పిలుస్తున్నారు.
అవును, ప్రపంచంలోనే అత్యంత ధనిక రాజకుటుంబం ఇది.ఈ రాజకుటుంబానికి చెందిన ఖజానా లెక్కపెట్టడం ఎవరి తరమూ కాదు.ఇక్కడ బంగారం, వెండి, వజ్రాలు ఇలా గుట్టలుగుట్టలు పోగుపడి ఉంటాయట.అంతేకాకుండా గ్రాండ్ ప్యాలెస్‌లో కోట్ల విలువైన లగ్జరీ కార్లు, క్రూయిజ్‌లతో పాటు బిలియన్ల విలువైన ప్రైవేట్ జెట్‌లు ఉన్నాయి.
సౌదీ అరేబియా( Saudi Arabia ) 1932 నుండి సౌద్ రాజవంశంచే దిగ్విజయంగా పరిపాలించబడుతుంది.ఇది ప్రపంచంలోని అత్యంత ధనిక మరియు అత్యంత శక్తివంతమైన కుటుంబాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు.దీని నికర విలువ US$1.4 ట్రిలియన్లు అని తాజా సర్వేలు చెబుతున్నాయి.అంటే ఈ ఆస్తి బ్రిటిష్ రాజకుటుంబం కంటే 16 రెట్లు ఎక్కువన్నమాట.ప్రస్తుతం ఈ కుటుంబానికి అధిపతి అంటే రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్.
( Salman bin Abdulaziz al-Saud ) వీరి కుటుంబీకులే దాదాపుగా 15000 మంది ఉంటారట.అల్వలీద్ బిన్ తలాల్( Alwaleed bin Talal ) ప్రస్తుతం దాదాపు US$20 బిలియన్ల నికర విలువతో అల్ సౌద్ కుటుంబంలో అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నాడు.
సౌదీ అరేబియా రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్, క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ కూడా సంపన్నులు అయినప్పటికీ వారి సంపద గురించి ఎవరికీ తెలియదు.సౌదీ అరేబియా రాజు ప్రస్తుతం ఆయన అధికారిక నివాసం అల్ యమామా ప్యాలెస్‌లో నివసిస్తున్నారు.1983లో రియాద్‌లో నిర్మించిన అల్ యమామా ప్యాలెస్ 4 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది.స్థానిక నజ్దీ శైలిలో ఇది నిర్మించబడింది.
ఈ ప్యాలెస్‌లో వెయ్యి పడక గదులు వున్నాయంటే మీరు నమ్ముతారా? దానితో పాటు సినిమా థియేటర్ అనేక స్విమ్మింగ్ పూల్స్ మసీదు కూడా ఉంది.
సౌదీ రాజ కుటుంబానికి అనేక విలాసవంతమైన క్రూయిజ్ షిప్‌లు, 2 హెలిప్యాడ్‌లు , స్పోర్ట్స్ గ్రౌండ్‌తో సహా అనేక సౌకర్యాలు ఉన్నాయి.అంతేకాకుండా వీరివద్ద భారీ బోయింగ్ 747-400 విమానం ఉంది.ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య విమానంగా చెప్పుకుంటారు.ఇక ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ అవుతుంది.వారిదగ్గర వున్న సూపర్ కార్ల ధర 1.2 మిలియన్ డాలర్లు.అంటే మన ఇండియన్ కరెన్సీతో పోలిస్తే వందల కోట్లు కార్ల ఖరీదే ఉంటుంది మరి.