కార్తీక స్నానం ఏ సమయంలో చేయటం వల్ల ఫలితాలు ఉంటాయో తెలుసా?

హిందువులు ఎంతో పవిత్రంగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక భావనలో మునిగిపోయారు.ఈ క్రమంలోనే చాలా మంది భక్తులు ప్రతిరోజూ ఉదయం స్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగిస్తూ వుంటారు.

 Do You Know The Results Of Doing Karthika Bath At Any Time Details, Karthika Ma-TeluguStop.com

ఇలా కార్తీక మాసంలో శివకేశవుల తలుచుకొని కార్తీక దీపం వెలిగించడం వల్ల మనం చేసిన పాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు.అయితే కార్తీక మాసంలో కార్తీక స్నానాలు ఏ సమయంలో చేయాలి.

ఏ సమయంలో చేయటం వల్ల ఉత్తమ ఫలితాలు ఉంటాయి అనే విషయానికి వస్తే…

కార్తీక స్నానం సూర్యోదయానికి ముందుగా అంటే ఐదున్నర గంటలకు పారుతున్న నదీ జలాలు, కాలువలలో చల్లనీటి స్నానం చేయడం ఎంతో మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పవచ్చు.కార్తీకమాసంలో సూర్యుడు తులా రాశిలో ఉండటం వల్ల నదీ ప్రవాహానికి ఎదురుగా నిలబడి మానవుడి శరీరానికి శక్తి కలిగి ఆరోగ్యసిద్ధి కలుగుతుంది.

ఈ మాసంలో పుణ్య నదీ స్నానం వల్ల పాపాలు తొలగి పుణ్యం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.కార్తీక మాసంలో సూర్యుడు ఉదయించక ముందే నక్షత్రాలు కనిపిస్తున్న సమయంలో స్నానమాచరించాలి అన్నది పూర్వీకులు పెట్టిన నియమం అని చెప్పవచ్చు.

ఇలా తెల్లవారుజామున నిద్రలేవడం వల్ల ఈ కాలంలో వచ్చే రోగాల నుంచి విముక్తి పొందవచ్చు అని చెప్పవచ్చు.ఈ క్రమంలోనే 5:30 గంటలకు చల్లని నీటితో స్నానం చేసి ఆ తర్వాత పొడి వస్త్రంతో కట్టుకొని సంకల్పం చెప్పుకొని మరొకసారి స్నానం చేయాలి.ఇలా స్నానం చేస్తున్న సమయంలో శ్లోకాలను చదవటం ఎంతో మంచిది.శ్లోకాలు రాని వాళ్ళు ఆ భగవంతుని నామస్మరణ చేసుకుంటూ కార్తీక స్నానాలు చేయటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయని పండితులు తెలియజేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube