ఆంజనేయ స్వామికి వెన్నతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో తెలుసా?

Do You Know The Result Of Anointing Anjaneya Swami With Butter Hanuman , Butter , Pooja, Ramayanam, Abishekam

పురాణాల ప్రకారం రామాయణంలో ఆంజనేయుడు పాత్ర ఎలా ఉందో మనకు తెలిసిందే.ఎక్కడైతే రామనామం వినబడుతుందో అక్కడ హనుమంతుడు ఉంటాడని, ఆంజనేయ స్వామిని నమస్కరించు కొనేవారు ముందుగా రామభక్తులై ఉండాలని పండితులు చెబుతున్నారు.

 Do You Know The Result Of Anointing Anjaneya Swami With Butter Hanuman , Butter-TeluguStop.com

ఆంజనేయుని పూజించేవారు శ్రీరాముని పూజించినచో ఆంజనేయుడు ఎంతో పరవశించి పోతాడు.హనుమంతుడిని ధైర్యానికి,బలానికి ప్రతీకగా భావిస్తాము.

ఆపదలో ఉన్న సమయంలో మనం ఆంజనేయుడిని ప్రార్థిస్తే ఆపదల నుంచి విముక్తి పొందవచ్చు అని భక్తులు భావిస్తారు.ఈ క్రమంలోనే ఆంజనేయ స్వామికి భక్తులు మంగళ, శనివారాలు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.

ప్రతి మంగళ, శనివారాలలో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు అలంకరణలు చేస్తారు.స్వామివారి అనుగ్రహం పొందడం కోసం స్వామివారికి ఎంతో ప్రీతికరమైన తమలపాకుల హారం, సింధూరంతో పూజ చేయటం వల్ల స్వామివారు ప్రీతి చెంది భక్తులు కోరిన కోరికలన్నీ నెరవేరుస్తాడనీ విశ్వసిస్తారు.

అదేవిధంగా స్వామివారికి ప్రత్యేక పూజలు అలంకరణ తర్వాత వడలు, తీపి అప్పాలు నైవేద్యంగా సమర్పించాలి.పూజ అనంతరం సుందర కాండ,హనుమాన్ చాలీసా చదవడం వల్ల స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది.

ఆంజనేయ స్వామికి అభిషేకం చేయాలనుకునే భక్తులు స్వామి వారికి ఎంతో ఇష్టమైన వెన్నతో అభిషేకం చేయడం వల్ల వారిపై ఉన్న దోషాలు తొలగిపోతాయి.ముఖ్యంగా అమావాస్య, కృష్ణపక్ష, శుక్లపక్ష నవమి వంటి రోజులలో స్వామి వారికి వెన్నతో అభిషేకం లేదా అలంకరణ చేయడం వల్ల వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగి పోయి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తారు.అదేవిధంగా ఆయురారోగ్యాలను ప్రసాదించడమే కాకుండా, మనలో ఉన్న భయాందోళనలను కూడా ఆంజనేయ స్వామి తొలగిస్తాడని పండితులు తెలియజేస్తున్నారు.ఆంజనేయస్వామికి పూజ చేసే సమయంలో ఎర్రని పుష్పాలను సమర్పించి పూజ చేయటం వల్ల స్వామి వారు ఎంతో ప్రీతి చెందుతారు.

Do You Know The Result Of Anointing Anjaneya Swami With Butter Hanuman , Butter , Pooja, Ramayanam, Abishekam - Telugu Abishekam, Butter, Hanuman, Hunaman Chalisa, Loard Srirama, Pooja, Ramayanam

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube