కెజిఎఫ్ కు మెగాస్టార్ కు మధ్య సంబంధం ఏంటో తెలుసా.. 35 ఏళ్ళ క్రితమే?

Do You Know The Relationship Between Kgf Hero And Megastar 35 Years Ago

ఒకటే భాషకు సంబంధించిన ఓ సినిమా కథను కొన్ని మార్పులతో అదే భాషలో మరో టైటిల్ తో తెరకెక్కించిన సందర్భాలు చాలా ఉన్నాయి.అలా ఒకటే కథ ను ప్రేక్షకులు చాలా వరకు గుర్తుపట్టలేక పోతారు.

 Do You Know The Relationship Between Kgf Hero And Megastar 35 Years Ago-TeluguStop.com

ఎందుకంటే కథలో మార్పులు ఉండటం వల్ల అదే కథ అని తెలుసుకోలేకపోతారు.కానీ కొన్ని సందర్భాలలో ప్రేక్షకులు వెంటనే గుర్తుపట్టేస్తుంటారు.

బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న సినిమా కథను మాత్రం పక్కా గుర్తుపెట్టుకుంటారు ప్రేక్షకులు.కానీ ఈ సినిమాను మాత్రం ఎవరూ అంతగా గుర్తు పట్టలేకపోయారు.

 Do You Know The Relationship Between Kgf Hero And Megastar 35 Years Ago-కెజిఎఫ్ కు మెగాస్టార్ కు మధ్య సంబంధం ఏంటో తెలుసా.. 35 ఏళ్ళ క్రితమే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అది ఏ సినిమానో కాదు కే జి ఎఫ్. ఈ సినిమా 2018 లో తెరకెక్కగా ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించాడు.హోమ్ భలే ఫిల్మ్ నిర్మాణ సంస్థ పై విజయ్ కీర్గందూర్ నిర్మాతగా చేశాడు.ఈ సినిమాకు రవి బుస్రూర్ సంగీతాన్ని అందించాడు.ఈ సినిమాను 80 కోట్ల బడ్జెట్ తో పెట్టుబడి పెట్టగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద 250 కోట్లను వసూలు చేసుకుంది.

ఇక ఈ సినిమా కథ గురించి అందరికీ తెలిసిందే.

ఇందులో రాకీ తన చిన్న వయసులో తండ్రిని కోల్పోయి తల్లి పెంపకంలో పెద్ద అవుతాడు.ఆ తర్వాత తన పద్నాలుగేళ్ళ వయసులో తన తల్లిని కోల్పోతాడు.

ఆ తర్వాత పెద్ద హోదాలో బ్రతకాలన్న ఆశతో డబ్బు సంపాదించాలని ముంబైకి చేరుకొని షూ పాలిష్ చేస్తుంటాడు.అలా ముంబైలో అలీ, శెట్టి కి మధ్య ఆధిపత్య పోరు సాగుతూ ఉంటుంది.

Telugu Chiranjeevi, Kgf Story, Rakshasudu, Relationship, Rockey, Story, Yash, Tollywood-Movie

ఆ సమయంలోనే శెట్టి పక్షాన నిలబడ్డ రామకృష్ణ రాఖీ గా ఎదుగుతాడు.రాఖీ బలం తెలుసుకున్న రాజ వర్ధన్ తనను బెంగళూరుకి పిలిపించి గరుడ చంపమని కోరతాడు.దీంతో అక్కడ అవకాశం కోల్పోవటంతో కే జి ఎఫ్ కు వెళ్తాడు.అక్కడ రాకీ చేసే ప్రయత్నాలే సినిమాలోని అసలు కథ.అయితే ఇటువంటి కథతోనే మెగాస్టార్ కు సంబంధం ఉంది.ఎందుకంటే ఇటువంటి కథతోనే చిరంజీవి గతంలో ఓ సినిమాలో నటించాడు.

Telugu Chiranjeevi, Kgf Story, Rakshasudu, Relationship, Rockey, Story, Yash, Tollywood-Movie

1986లో ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రాక్షసుడు. ఈ సినిమాలో చిరంజీవి, సుహాసిని, రాధా నటీనటులుగా నటించారు.ఇక ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కగా మంచి బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించుకొని భారీ వసూళ్లు సొంతం చేసుకుంది.ఇక ఈ సినిమా కథ కూడా చాలావరకు కేజిఎఫ్ తోనే పోలి ఉంటుంది.

నిజానికి ఈ సినిమా కథనే కేజిఎఫ్ గా తెరకెక్కించారని చెప్పవచ్చు.

Telugu Chiranjeevi, Kgf Story, Rakshasudu, Relationship, Rockey, Story, Yash, Tollywood-Movie

ఇందులో చిరంజీవిని  ఒకడు చేసిన మోసం వల్ల అడవిలో పెరిగి పెద్ద అవుతాడు.ఇక ఒక స్నేహితుడితో అక్కడి నుంచి తప్పించుకొని తన తల్లి కోసం వెతుకుతాడు.అలా ఒక బృందం తన తల్లిని చూపిస్తానని ఒప్పందం చేసుకొని తన తల్లి కోసం చేసే పోరాటమే కేజిఎఫ్ లాగా ఉంటుంది.

అలా చాలావరకు కే జి ఎఫ్ ను పోలి ఉండటంతో చిరంజీవికి ఈ సినిమాతో సంబంధం ఉందని తెలుస్తుంది.

#Relationship #Chiranjeevi #Rakshasudu #Kgf #Kodandarami

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube