ఆ వ్యాపారులతో లతా మంగేష్కర్ కు ఉన్న అనుబంధం గురించి ఎవరి తెలియదు?

ప్రముఖ దిగ్గజ గాయని, గాన కోకిల లతా మంగేష్కర్ మరణవార్తను ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.ఈ క్రమంలోనే లతామంగేష్కర్ అనారోగ్యంతో మృతి చెందడంతో ఎంతోమంది ఆమెతో వారికి ఉన్న అనుబంధం గురించి గుర్తు చేసుకుంటున్నారు.

 Do You Know The Relation Between Lata Mangeshkar And That Businessmans, Lata Man-TeluguStop.com

ఈ క్రమంలోనే లతా మంగేష్కర్ కు బనారస్ చీరల వ్యాపారులకు మధ్య ఎంతో మంచి అనుబంధం ఉందని ఈ సందర్భంగా ఆ వ్యాపారులు లతామంగేష్కర్ తో తనకున్న అనుబంధం గురించి బయట పెట్టారు.

ఉత్తరప్రదేశ్‌, వారణాసికి చెందిన అర్మాన్‌, రిజ్వాన్‌ అనే ఇద్దరిని కదిలిస్తే దిగ్గజ గాయని లతామంగేష్కర్‌ ఎలాంటి హృదయం కలవారో వీరు తెలియజేస్తారు.

వారణాసికి చెందిన ఇద్దరు వ్యాపారులు బనారస్ చీరలు తయారు చేయించి వాటిని విక్రయిస్తూ వ్యాపారం కొనసాగించారు.ఈ క్రమంలోనే ఓ సారి వారణాసికి వెళ్లిన లతా మంగేష్కర్ వీరితో ఒక చీరను తయారు చేయించి తీసుకువెళ్లారు.

ఈ విధంగా అర్మాన్‌, రిజ్వాన్‌ బనారస్‌ చీరలు లతాజీకీ నచ్చడంతో తరచూ తనకు కావలసిన చీరలను ఫోన్లో ఆర్డర్ చేస్తే వీరు తయారు చేయించి పంపించేవారు.ఈ క్రమంలోనే లతా మంగేష్కర్ చెక్కు రూపంలో వారికి డబ్బులు పంపించేది.

ఇలా ఆ వ్యాపారులకు లతా మంగేష్కర్ కు మధ్య ఎంతో మంచి అనుబంధం ఏర్పడిందని నెలలో రెండు మూడు సార్లు ఆమె వారికి ఫోన్ చేసి వారి కుశల ప్రశ్నలు కూడా అడిగే వారని అదే విధంగా తమ కుటుంబ సభ్యులతో కూడా లతా మంగేష్కర్ ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవారని ఈ సందర్భంగా ఈ బనారస్ చీరల వ్యాపారులు తెలియజేశారు.ఈ విధంగా లతామంగేష్కర్ తో తమకు ఎంతో మంచి అనుబంధం ఏర్పడిందని అయితే ఆమె మరణించారనే వార్త తెలియడంతో ఒక్కసారిగా ఆమె మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నామని వీరు తెలియజేశారు.

ఈ క్రమంలోనే లతా మంగేష్కర్ ఫోన్ కాల్ చేసినప్పుడు ఆమె వాయిస్ రికార్డ్ చేసి ఆమె గుర్తుగా దాచుకున్నామని అదే విధంగా తనకు చీరలు పంపినప్పుడు తను పంపించే చెక్కును మేము డబ్బు రూపంలోకి మార్చకుండా తన సంతకం చిరకాలం మాతోపాటు ఉండాలని ఆ చెక్కులను ఫోటో ఫ్రేమ్ చేయించి భద్ర పరిచామని ఈ సందర్భంగా అర్మాన్‌, రిజ్వాన్‌ లు వారికి లతా మంగేష్కర్ పై ఉన్న అభిమానాన్ని బయటపెట్టారు.ఇక వీరు ఆమెను లతా మంగేష్కర్ కాకుండా అమ్మ అని పిలిచేవారని ఈ సందర్భంగా తెలిపారు.అయితే ప్రస్తుతం ఆమె దూరమయ్యారని వార్త ఎంతో కఠినంగా ఉందని వీరు తెలియజేశారు.ఇక అందరూ ఎంతో ముద్దుగా గానకోకిల అని పిలుచుకునే లతామంగేష్కర్ అసలు పేరు హృదయ్ మంగేష్కర్.

Lata Mangeshkar was like a mother,Says Banarasi Saree trader’s Family

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube