హనుమంతుడు భూత ప్రేత పిశాచాల నుంచి మనల్ని రక్షించడానికి కారణమేమిటో తెలుసా?

ఆంజనేయ స్వామి ఆలయం లేని గ్రామం అంటూ ఉండదు.అదేవిధంగా ఆంజనేయస్వామి ఫోటో లేదా విగ్రహం కూడా లేని ఇల్లు ఉండదు.

 What Is The Reason Behind Hanuman Protects Us From Demons, Hanuman, Demons, Rama-TeluguStop.com

ప్రతి ఒక్కరి ఇంటిలో ఆంజనేయస్వామి ప్రతిమ తప్పకుండా మనకు దర్శనమిస్తుంది.మన హిందూ దేవుళ్ళలో ఆంజనేయ స్వామికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది.

రామాయణంలో శ్రీ రామచంద్ర ప్రభుకి ఆంజనేయుడు నమ్మినబంటుగా ఉంటాడు.ఈ క్రమంలోనే భక్తులు శ్రీరామచంద్రుని పూజించిన లేదా ఆంజనేయుడుని పూజించిన ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా మనపై ఉంటాయి.

ఆంజనేయుడు శ్రీరాముడికి ఏ విధమైనటువంటి భక్తుడో మనకు తెలిసిందే.

ఇక రామభక్తులు ఆంజనేయ స్వామిని పూజించడం కూడా చేస్తుంటారు.

ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల ఏ విధమైనటువంటి దోషాలు, గ్రహస్థితులు, భూత ప్రేత పిశాచాల భయం ఉండదని భావిస్తారు.ఈ విధంగా భూతాలకు భయపడేవారిని ఆంజనేయ స్వామి ఆలయానికి తీసుకెళ్లి అక్కడ స్వామివారి తాయెత్తులు కట్టించడం ద్వారా వారికి ఆ భయం తొలగిపోతుందని భక్తుల విశ్వసిస్తుంటారు.

అదే విధంగా ఇలాంటి భయాందోళనలో ఉన్నవారు ఎక్కువగా శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనే మంత్రాన్ని జపిస్తూ ఉండటం వల్ల వారికి ధైర్యం కలుగుతుందని భావిస్తారు.నిజంగానే ఆంజనేయస్వామి పిశాచాల నుంచి మనల్ని రక్షిస్తాడా… మనల్ని ఆంజనేయ స్వామి ఈ విధంగా రక్షించడానికి గల కారణాలు ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…

Telugu Hanuman, Protects, Ramayana, Telugu Bhakthi-Latest News - Telugu

రామనామం ఎంత మధురమైనదో ఆంజనేయస్వామి ఎంతో అద్భుతంగా వివరించారు.ఈ క్రమంలోనే విష్ణుమూర్తి తన రాముడి అవతారాన్ని చాలిస్తూ ఆంజనేయుడికి ఒక విషయం చెప్పి తప్పకుండా పాటించాలని చెబుతాడు.ఈ క్రమంలోనే శ్రీరాముడు తన తనువు చాలిస్తూ.

హనుమా కలియుగం అంతమయ్యేవరకు భూలోకంలో ఉండి సజ్జనులను కాపాడాలని వారికి కలిగే భయం, ఆందోళన, భూత ప్రేత పిశాచాల నుంచి వారిని కాపాడి వారిలో ధైర్యం నింపాలని ఈ భూలోక వాసులకు నువ్వు రక్షణ కల్పించాలని చెబుతూ తన అవతారాన్ని చాలిస్తాడు.ఈ విధంగా శ్రీ రాముడు ఆంజనేయుడి కోరిక కోరడంతో శ్రీ రాముడి ఆజ్ఞను హనుమంతుడు నెరవేరుస్తానని మాట ఇవ్వడం వల్ల ఆంజనేయస్వామి కలియుగంలో భక్తులకు రక్షణగా ఉండి వారికి కలిగే భయాందోళనలను నుంచి రక్షిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube