శుభకార్యాలలో పట్టు వస్త్రాలు ధరించడం వెనుక ఉన్న కారణం ఏంటో తెలుసా?

సాధారణంగా మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏదైనా శుభకార్యాలు జరుగుతున్న సమయంలో ప్రతి ఒక్కరూ పట్టు వస్త్రాలను ధరించడం ఆనవాయితీగా ఉంది.ఈ క్రమంలోనే ఏదైనా పూజా కార్యక్రమాలు లేదా వివాహాది శుభకార్యాలు జరుగుతున్న సమయంలో ప్రతి ఒక్కరూ పట్టు వస్త్రాలను ధరించి పూజకు కార్యక్రమాలలో పాల్గొనడం మనం చూస్తుంటాము.

 Do You Know The Reason Behind Wearing Silk Clothes In Good Deeds Details, Festi-TeluguStop.com

అయితే శుభకార్యాలలో ఈ విధంగా పట్టు వస్త్రాలు ధరించడానికి కారణం ఏమిటి అనే విషయానికి వస్తే…

ఆధునిక శాస్త్రం ప్రకారం ప్రతి ప్రాణ చుట్టూ ఓరా అనబడే సప్త వర్ణ కాంతి పుంజం ఉంటుంది. ఇది మన శారీరక మానసిక పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది.

అయితే పట్టు వస్త్రాలను ధరించినపుడు ఈ ఓరా ఎంతో కాంతివంతంగా శక్తివంతంగా చుట్టూ ఉన్న పాజిటివ్ ఎనర్జీని గ్రహించి దానిని మన శరీరంలోకి ప్రవేశించేలా చేస్తుంది.ఈ క్రమంలోనే మనం చేస్తున్న కార్యం పై దృష్టిని పెడతాము.

అందువల్ల ఏదైనా శుభకార్యాలలో పాల్గొన్నప్పుడు పూజా కార్యక్రమాలలో పాల్గొప్పుడు లేదా గుడికి వెళుతున్న సమయంలో పట్టు వస్త్రాలను ధరించడం వల్ల మన ఏకాగ్రత మొత్తం ఆ భగవంతుడి పై ఉంటుంది.

ఈ కారణం వల్ల శుభ కార్యాలలో పట్టు వస్త్రాలను ధరించడం ఆచారంగా భావిస్తారు.ప్రస్తుత కాలంలో ఎన్నో డిజైన్లతో ఎన్నో రంగులతో పట్టు వస్త్రాలు మార్కెట్లో లభిస్తున్నాయి.ముఖ్యంగా మహిళలు ఏ చిన్న కార్యం చేసిన పట్టు వస్త్రాలను ధరిస్తూ ఉంటారు.

ఇలా కొన్ని సాంప్రదాయాలను సైన్స్ పరంగా ఆలోచించి వాటిని సాంప్రదాయంగా పెట్టడం వల్ల ఇప్పటికీ అలాంటి ఆచారాలను పాటించడం వల్ల ఆరోగ్య పరంగా కూడా ఎంతో మంచిగా ఉండగలగుతున్నాము.

Do You Know The Reason Behind Wearing Silk Clothes In Good Deeds Details

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube