బిగ్ బాస్ హోస్టింగ్ సమయంలో సమంత కట్టుకున్న చీర ధర ఎంతో తెలుసా..?!

వారం రోజుల క్రితం బిగ్ బాస్ షో కు కింగ్ నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ లో బిజీగా ఉండడంతో ఆయన కోడలు అక్కినేని సమంత హోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.అయితే ఆ సమయానికి కరెక్టుగా దసరా పండుగ రావడంతో పండుగ వాతావరణం కనిపించేలా బిగ్ బాస్ వాతావరణాన్ని క్రియేట్ చేసి మూడు గంటల పాటు కార్యక్రమాన్ని ప్రసారం చేశారు.

 Do You Know The Price Of The Sari Worn By Samantha During Big Boss Hosting  Bigg-TeluguStop.com

అంత వరకు కేవలం సినిమాల్లోనే అలరించిన అక్కినేని సమంత మొట్టమొదటిసారిగా బిగ్ బాస్ షో ద్వారా హోస్ట్ గా కనిపించి అందరినీ ఎంటర్టైన్ చేసింది.ఈ షోకు ఆమెకు మంచి మార్కులే పడ్డాయి అని చెప్పవచ్చు.

వచ్చీరాని తెలుగు తో అందరితో క్యూట్ గా మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులను బాగా అలరించింది.కంటెస్టెంట్స్ గురించి ఆవిడ విశేషాలు తెలుపుతూ అలాగే వారికి కొన్ని సూచనలు కూడా ఇచ్చింది.

ఇకపోతే సమంత హోస్టింగ్ ఎలా ఉంది అన్న ప్రశ్నకు నెటిజెన్స్ సోషల్ మీడియాలో ఏకంగా 74 శాతం ఓట్లు బాగుందని తెలిపారు.

ఇకపోతే ఆ షోలో భాగంగా అక్కినేని సమంత కట్టుకున్న చీర గురించి చాలామంది గుసగుసలు ఆడుకున్నారు ఆడవారు.

అయితే ఈ చీర గురించి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది.ఈ చీరను క్షితిజ్ జలోరి అనే డిజైనర్ డిజైన్ చేసి ఇచ్చారు.ఇకపోతే ఈ చీర ధర 44, 800 రూపాయలుగా తెలుస్తోంది.చీర ఖరీదు ఎక్కువైనా ఆ చీరలో అక్కినేని సమంత అచ్చ తెలుగు అమ్మాయిలా కనపడడం అందరిని మెప్పించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube