స్టార్స్ తాగే ఆ బ్లాక్ వాటర్ ధర ఎంతో తెలుసా..?!

ఈ మధ్య సెలబ్రిటీలు బ్లాక్ వాటర్ తో దర్శనమిస్తున్నారు.చాలామంది సెలబ్రిటీలు ఈ బ్లాక్ వాటర్ ను తాగడం మనం చూస్తూనే ఉన్నాం.

 Do You Know The Price Of The Black Water That The Stars Drink, Malaika ,virat-TeluguStop.com

ఇందులో ముఖ్యంగా అత్యంత ఫిట్ గా ఉండే ఇండియా క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా బ్లాక్ వాటర్ తాగుతుంటాడు.ఫిట్నెస్ అనేది వారికి చాలా ముఖ్యం.

అందుకే వారు ఎంతో శ్రమిస్తుంటారు.తినే విషయలో కూడా వారు ప్రత్యేక శ్రద్దతో ఉంటారు.2014వ సంవత్సరం వరకూ విరాట్ కోహ్లీ ఫిట్నెస్ విషయంలో అంతగా శ్రద్ద చూపలేదు.ఆ తర్వాత దానిమీద ఫోకస్ పెట్టాడు.

డైట్ విషయంలో కాస్త జాగ్రత్తగానే ఉన్నాడు.ఆఖరికి విరాట్ కోహ్లీ తాగే నీళ్లను కూడా ఫ్రాన్స్ నుంచి తెప్పించుకుంటున్నాడు.

విరాట్ ఒక సంవత్సరం ముందు నుంచి బ్లాక్ వాటర్ తాగడాన్ని అలవాటు చేసుకున్నాడు.ఈ విషయం తాజాగా బయటపడింది.

అసలు ఇంతకీ ఈ బ్లాక్ వాటర్ అంటే ఏంటి అనే విషయంపై నెటిజన్లు తెగ సర్చ్ చేస్తున్నారు.మామూలుగా మనం నీళ్లు తాగుతాం కదా.అందులో ph స్థాయి 7 ఉంటుంది.ఇకపోతే ఈ బ్లాక్ వాటర్ లో మాత్రం ph స్థాయి అనేది అంతకుమించి ఉంటుంది.

మన శరీరం డీహైడ్రేటెడ్ కాకుండా అత్యంత ఎక్కువగా ఫిట్ గా ఉండే విధంగా ఈ బ్లాక్ వాటర్ చేస్తుంది.ఈ బ్లాక్ వాటర్ గురించి ముఖ్యంగా చెప్పాలంటే దీనిని తాగితే డిప్రెషన్ అనేది రాదు.

ఈ బ్లాక్ వాటర్ ను కనుక రోజూ తాగుతున్నట్లైతే చర్మం కమిలిపోకుండా ఎటువంటి చర్మ సమస్యలు రాకుండా యవ్వనంగా కనిపిస్తారు.విరాట్ కోహ్లీనే కాదు ఈ బ్లాక్ వాటర్ ను చాలామంది సెటబ్రిటీలు తాగుతారు.

బాలీవుడ్ హీరోయిన్లు అయిన మలైకా అరోరా, ఊర్వశి రౌతేలా, శ్రుతి హాసన్ లు కూడా ఈ బ్లాక్ వాటర్ ను తాగుతారు.ఈ బ్లాక్ వాటర్ లీటర్ ధర 3000 – 4000 వరకు ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube