పవర్ స్టార్ బండి నెంబర్ ఎంతో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తర్వాత, వరుసగా మెగా కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి పలువురు హీరోలు ఎంట్రీ ఇచ్చారు.ఈ విధంగా మెగా కాంపౌండ్ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరని చెప్పవచ్చు.

 Do You Know The Power Star Cart Number, Pawan Kalyan, Vakeel Sab, Tollywood, Bik-TeluguStop.com

పవన్ కళ్యాణ్ అన్న మెగాస్టార్ చిరంజీవి అప్పట్లో మంచి హీరోగా ఎంతో గుర్తింపు సంపాదించుకోవడంతో చిరంజీవి ప్రమేయంతోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.పవన్ కళ్యాణ్ 1996 లో “అక్కడ అమ్మాయి,ఇక్కడ అబ్బాయి”అనే చిత్రం ద్వారా వెండితెరపై సందడి చేశారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తొంబై ఆరులో వచ్చిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించగా ఈ చిత్రానికి ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, సుప్రియ ప్రధాన పాత్రలలో నటించారు.

పవన్ కళ్యాణ్ నటించిన మొదటి సినిమానే బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సృష్టించింది.మొదటి సినిమానే విజయవంతం కావడంతో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గోకులంలో సీత, సుస్వాగతం, బద్రి, ఖుషి వంటి వరుస విజయాలతో ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరిగా నిలిచారు.

వరస విజయాల తర్వాత పవన్ కళ్యాణ్ వరుస అపజయాలను కూడా ఎదుర్కొన్నారు.ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ కెరీర్ లో నటించింది.

అతి తక్కువ సినిమాలే అయినప్పటికీ ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్నారు.

వరుస అపజయాలను ఎదురు కొన్న పవన్ కళ్యాణ్ ప్రజా సేవకోసం రాజకీయాలలోకి ప్రవేశించారు.

జనసేన పార్టీని స్థాపించి కొంత కాలం పాటు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు.కొంతకాలం రాజకీయాలలో ప్రజా సేవ చేసిన పవన్ కళ్యాణ్ కు రాజకీయాలలో ఎదురు దెబ్బ తగలడంతో తిరిగి తన దృష్టి మొత్తం సినిమాల వైపు మళ్ళించాడు.

ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్న పవన్ కళ్యాణ్ మొదటిగా నటిస్తున్న సినిమా “వకీల్ సాబ్”అనే సినిమాలో నటిస్తున్నారు.బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రంగా రూపొందిన పింక్ చిత్రానికి రీమేక్ గా ఈ సినిమాలో నటిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికీ పలు పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన శృతిహాసన్ జతకట్టారు.

ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా సంచలన విజయం సృష్టించింది.మరోసారి ఈ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంటుందని, ఇటు చిత్రబృందం, ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.

Telugu Pawan Kalyan, Tollywood, Vakeel Sab-Movie

పవన్ కళ్యాణ్ ను అభిమానించే ఎంతోమంది అభిమానులు తన గురించి ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని ఎంతో ఆరాటపడుతుంటారు.ఈ క్రమంలోనే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ బండి నెంబర్ తెలియడంతో అభిమానులు ఫుల్ ఖుషి లో ఉన్నారు.పవన్ కళ్యాణ్ రాయల్ ఎన్ఫీల్డ్ బండి నెంబర్ AP 09 PS 3639 ప్రస్తుత పవన్ కళ్యాణ్ ఈ బండి నెంబర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే పవన్ కళ్యాణ్ శృతిహాసన్ వెళ్తున్న ఈ బండి పవన్ కళ్యాణ్ రియల్ బండి మాత్రం కాదు, ఇది వకీల్ సాబ్ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఉపయోగించిన రీల్ బండి.

ప్రస్తుతం ఈ బండి నెంబర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ బండి నెంబర్ చూసిన కొందరు నెటిజన్లు ఈ నంబర్ ప్లేట్ పై ఉన్న P.S ను కొందరు పవర్ స్టార్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube