స్త్రీ రూపంలో పూజలందుకునే హనుమంతుని ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఆంజనేయ స్వామిని భక్తులు పెద్దఎత్తున పూజిస్తారు.బలానికి ధైర్యానికి ప్రతీకగా ఆంజనేయస్వామికి భక్తులు పెద్ద ఎత్తున పూజలు చేస్తూ స్వామివారికి మొక్కులు తీర్చుకుంటారు.

 Do You Know The Place Where Lord Anjaneya Is Worshipped In A Female Form-TeluguStop.com

అయితే మనకు ఆంజనేయస్వామినీ ఎక్కువగా ఒంటికన్ను ఆంజనేయస్వామిగా, పంచముఖ ఆంజనేయ స్వామిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు.కానీ మీరు ఎప్పుడైనా ఆంజనేయ స్వామి వారు స్త్రీ రూపంలో దర్శనం ఇవ్వడం చూశారా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా చతిస్గడ్ రాష్ట్రంలోనే రతన్ పూర్ జిల్లాలో,గిర్జ్ బంద్ గ్రామానికి వెళితే స్త్రీ రూపంలో దర్శనం ఇచ్చే ఆంజనేయస్వామిని చూడవచ్చు.

ఇక్కడ వెలసినటువంటి ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించి భక్తులు కోరికలు కోరుకుంటే తప్పకుండా ఆ కోరికలు నెరవేరుస్తాడని పెద్దఎత్తున భక్తులు విశ్వసిస్తారు.ఈ ఆలయంలో కేవలం స్త్రీ రూపంలో ఉన్న ఆంజనేయస్వామి మాత్రమే కాకుండా సీత రాములను తన భుజాలపై మోస్తునటువంటి ఆంజనేయ విగ్రహాన్ని కూడా మనం చూడవచ్చు.

 Do You Know The Place Where Lord Anjaneya Is Worshipped In A Female Form-స్త్రీ రూపంలో పూజలందుకునే హనుమంతుని ఆలయం ఎక్కడ ఉందో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అసలు ఇక్కడ వెలసినటువంటి స్వామి వారు శ్రీ రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వడానికి గల కారణం ఏమిటి అని ఈ విషయానికి వస్తే.

ఆలయ చరిత్ర విషయానికి వస్తేఆంజనేయుని భక్తుడైన రతన్ పూర్ రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది.తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రాజుకు ఒకరోజు స్వామివారు కలలోకి వచ్చి తనకు ఆలయం నిర్మించాలని సూచించారనీ చెప్పడంతో రాజు స్వామి ఆజ్ఞ మేరకు ఈ ఆలయ నిర్మాణం చేపట్టాడు.ఈ విధంగా ఆలయ నిర్మాణం పూర్తవుతున్న క్రమంలో ఆ రాజుకు మరోసారి స్వామివారు కలలో కనిపించి మహామాయ కుండ్ వద్ద ఉన్న తన విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్టించారని చెప్పారు.

స్వామివారు కలలో చెప్పిన విధంగానే ఆ ప్రాంతానికి వెళ్లిన రాజుకు అక్కడ శ్రీ రూపంలో ఉన్నటువంటి ఆంజనేయస్వామి విగ్రహం కనిపించింది.అయితే స్వామి ఆజ్ఞ ప్రకారం రాజు ఆ విగ్రహాన్ని తీసుకువచ్చి ఆలయంలో ప్రతిష్టించారు.

ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాత రాజు ఆరోగ్యం కుదుటపడిందని అప్పటినుంచి ఈ ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుందని ఆలయ విశిష్టత గురించి స్థానికులు చెబుతున్నారు.

#LordHanuman #Pooja #Ratanpur #Chhattisgarh #Female Hanuman

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube