వాషింగ్ టన్ సుందర్ పెంపుడు కుక్క పేరు ఏంటో తెలుసా?

భారత క్రికెట్ లో యువతరం హవా నడుస్తోంది.సీనియర్లు వరుసగా రిటైర్ మెంట్స్ ప్రకటించినా భారత క్రికెట్ ఏ మాత్రం వెనకబడకుండా అదే నంబర్ 1 స్థానంలో కొనసాగుతుందంటే యువ క్రికెటర్ల టాలెంట్ తోనే ఇది సాధ్యపడుతూ వస్తోంది.

 Do You Know The Name Of Washington Sundar's Pet Dog, Indian Cricket, Washington-TeluguStop.com

ఇక ప్రత్యర్థి జట్టులో ఎంత మంది సీనియర్ ఆటగాళ్లు ఉన్నా ప్రత్యర్థి జట్టును మన కుర్రాళ్ళు మట్టికరిపిస్తున్నారనేది మనం చూస్తున్నాం.అందుకు ప్రత్యక్ష ఉదాహరణ గబ్బా టెస్ట్.

ఒక విధంగా చెప్పాలంటే ఆ టెస్ట్ ద్వారానే మన కుర్రాళ్ళు రాటుదేలారనే చెప్పవచ్చు.ఆస్ట్రేలియా బౌలర్ల స్లెడ్జింగ్ లు, కొంత మంది ప్రేక్షకుల వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారాన్నే రేపిన విషయం తెలిసిందే.

అయితే ఆ టెస్ట్ లో ఆస్ట్రేలియా టీంను వారి గడ్డలోనే గత 35 సంవత్సరాలుగా ఆస్ట్రేలియా ఓటమి చెందని ఆ రికార్డును మనం ఆ రికార్డును బద్దలు కొట్టి విజయం సాధించాం.అయితే ఆ టెస్ట్ ద్వారా యువ ప్లేయర్ లు సత్తా చాటడం వలన ఆ టెస్ట్ విజయం సాధించడం జరిగింది.

ఇక ఆ యువ ప్లేయర్ లలో ఒకరు వాషింగ్ టన్ సుందర్.ఇక బౌలర్ గా వరుస వికెట్లు తీస్తూ ప్రత్యర్థికి చుక్కలు చూపించిన వాషింగ్ టన్ సుందర్ పెంపుడు కుక్క పేరు గురించి ఓ వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

అయితే వాషింగ్ టన్ సుందర్ తన పెంపుడు కుక్కకు “గబ్బా” అని పేరు పెట్టాడట.గబ్బా టెస్టుకు గుర్తుగా ఈ పేరు పెట్టినట్లు తెలుస్తోంది.ఇక ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా సుందర్ తెలియజేయడంతో నెటిజన్ల లైక్స్, కామెంట్స్ తో ఈ వార్త మరింత వైరల్ గా మారుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube