ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు అందరూ కూడా పెద్ద ఎత్తున సినిమాలలోను సీరియల్స్ లోను నటించడమే కాకుండా ఇతర ఆదాయం కోసం యూట్యూబ్ ఛానల్ ( You Tube Channel ) రన్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇలా ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి వారికి సంబంధించిన అన్ని వీడియోలను యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు.
ఈ క్రమంలోనే బుల్లితెర నటీనటులుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి శ్రీవాణి ( Sreevani ) విక్రమ్ ( Vikram ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.శ్రీ వాణి విక్రమాదిత్య ఇద్దరు కూడా బుల్లితెర నటీనటులుగా కొనసాగాడు అయితే ప్రస్తుతం శ్రీ వాణి సీరియల్స్ లో చేస్తూ ఉండగా విక్రమ్ మాత్రం మీ కడుపునిండా అనే హోటల్ రన్ చేస్తున్నారు.
ఇక ఈ దంపతులకు రాజ నందిని అనే ఒక కుమార్తె కూడా ఉన్న సంగతి మనకు తెలిసిందే.ఇలా పలు సీరియల్స్ ద్వారా ఎంతో బిజీగా ఉన్నటువంటి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నారు ఈమె తనకు సంబంధించిన విషయాలతో పాటు తన రెస్టారెంట్ కి సంబంధించిన అన్ని విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు.అయితే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి విక్రం శ్రీవాణి ఇద్దరు కూడా వారికి సంబంధించి ఎన్నో విషయాలను అభిమానులతో షేర్ చేసుకున్నారు.ఇక తాము ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్లమనే తెలిపారు మాకు ఉన్నదాంట్లో మేము చాలా సంతోషంగా ఉంటామనీ, ఎలాంటి ఆడంబరాలకు పోమని ఈ దంపతులు తెలియజేశారు.
ఇక యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా భారీ స్థాయిలోనే అభిమానులను సొంతం చేసుకున్నారు కదా నెలకు ఎంత మొత్తంలో సంపాదిస్తున్నారు అంటూ యాంకర్ ప్రశ్నించారు.అయితే ఈ ప్రశ్నకు శ్రీవాణి దంపతులు షాకింగ్ సమాధానం చెప్పారు.శ్రీవాణి ఈ సందర్భంగా మాట్లాడుతూ మేము యూట్యూబ్ ద్వారా షేర్ చేసినటువంటి కొన్ని వీడియోలకు నెలకు దాదాపు 30 లక్షల వరకు రెమ్యూనరేషన్ వచ్చింది అంటూ షాకింగ్ సమాధానం చెప్పారు.ఈ మధ్యకాలంలో యూట్యూబర్స్ అందరూ కూడా వారికి నెలకు ఎంత వస్తుంది అనే విషయాలని బహిరంగంగా అందరితో పంచుకుంటున్నారు.
తాజాగా ఆదిరెడ్డి తనకు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక నెలకు 39 లక్షల రూపాయల రెమ్యూనరేషన్( Remuneration ) వచ్చింది అంటూ ఆధారాలతో సహా చూపించిన సంగతి మనకు తెలిసిందే ఈ క్రమంలోని శ్రీవాణి దంపతులకు కూడా తన కుమార్తె సారీ ఫంక్షన్ వీడియోని షేర్ చేయడంతో ఆ నెల మాకు 30 లక్షల రూపాయల అమౌంట్ వచ్చిందని ఆ డబ్బుతో మేము మా ఇంటికి అడ్వాన్స్ చెల్లించామని తెలిపారు.అలాగే గృహప్రవేశ వీడియో ఇంకొన్ని వీడియోలకు భారీ స్థాయిలో వ్యూస్ వచ్చాయని అప్పుడు మాకు 30 లక్షలకు పైగా యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చాయి అంటూ చెప్పడంతో అందరూ షాక్ అవుతున్నారు ఇలా యూట్యూబ్ ద్వారా నెలకు ఇన్ని లక్షల ఆదాయం వస్తుందా అంటూ షాక్ అవుతున్నారు.