ఒక్కో సినిమాకు మణిశర్మ పారితోషికం ఏంటో తెలుసా?

సంగీతం అంటే ఇష్టపడని వారు ఉండరనే విషయం మనకు తెలిసిందే.ఎందుకంటే సంగీతం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమయంలో కీలకపాత్ర పోషించి ఉండే ఉంటుంది.

 Do You Know The Manisharma Award For Each Film, Music Director Manisharma, Viral-TeluguStop.com

మనం సంతోషంగా ఉన్నప్పుడు ఒక పాట విని ఎంజాయ్ చేస్తాం, బాధలో ఉన్నప్పుడు పాటలో ఉన్న లిరిక్స్ వింటూ మనం బాధను మర్చిపోతాం.అలా సంగీతం అనేది మనిషి రోజూవారీ జీవితంలో ఒక నిత్యకృత్యమయింది.

ప్రతి ఒక్కరు పాటలలో మెలోడీని ఎక్కువగా ఇష్టపడుతారు.ఇక మెలోడీ అంటే మనందరికి ఠక్కున గుర్తుకొచ్చేది ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ.

మెలోడీలో అత్యద్భుత సంగీతాన్ని సమకూర్చుతూ మెలోడీ బ్రహ్మ మణిశర్మగా పేరు సంపాదించుకున్నాడు.

ఇటీవల ఇస్మార్ట్ శంకర్ సినిమాకు అద్భుతంగా సంగీతాన్ని సమకూర్చి మరల ఫామ్ లోకి వచ్చాడు.

ఇప్పుడు మణిశర్మ రెమ్యునరేషన్ కు సంబంధించి ఓ వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది.అయితే మణిశర్మ రెమ్యునరేషన్ ఎంత ఉంటుందో తెలుసుకోవాలని మనలో చాలా మందికి ఉంటుంది కదా.మణిశర్మ ఒక్కో సినిమాకు కోటి రూపాయల నుండి కోటిన్నర వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు ట్రేడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది.ఎంత మంది సంగీత దర్శకులు వచ్చినా మణిశర్మ పాటకు  ప్రేక్షకులలో మంచి గుర్తింపు ఉంటుంది.

అంతలా మణిశర్మ పాటలను శ్రోతలు అంతలా అక్కున చేర్చుకున్నారని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube