లక్షల కిలోల గోల్డ్ ఉత్పత్తి చేసే అతి పెద్ద గోల్డ్ మైన్ ఏదో తెలుసా..?!

భారతదేశంలో ప్రతి ఒక్కరూ పసిడిని ఎంతో విలువైనదిగా, పవిత్రమైనదిగా పరిగణిస్తుంటారు.ప్రతి శుభకార్యంలో, ఆడవారి ఒంటిపై దగదగ మెరిసే బంగారానికి భారతీయుల్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉందంటే అతిశయోక్తి కాదు.

 Do You Know The Largest Gold Mine That Produces Millions Of Kilograms Of Gold Go-TeluguStop.com

మరి ఈ బంగారం అంతా ఎక్కడి నుంచి వస్తుందని అడిగితే? గోల్డ్ మైన్స్ అని ఠక్కున సమాధానం చెబుతారు.కానీ ఏ దేశంలోని గోల్డ్ మైన్స్ బంగారాన్ని ప్రపంచ దేశాలకు పంచుతున్నాయి? అసలు గోల్డ్ ఎక్కువగా ఎక్కడి నుంచి వస్తుంది? అని ప్రశ్నిస్తే చెప్పడం కష్టమే.ఎందుకంటే చాలా మందికి ఒక గోల్డ్ మైన్ గురించి తెలియకపోవచ్చు.నిజానికి ఆ గోల్డ్ మైన్ ప్రపంచంలోనే అతి పెద్ద బంగారు గని గా వెలుగొందుతోంది.ఇది ప్రతి సంవత్సరం లక్షల కిలోల గోల్డ్ ను ఉత్పత్తి చేస్తోంది.మరి ఆ అతిపెద్ద గోల్డ్ మైన్ ప్రత్యేకతలేంటి? అది ఎక్కడుంది? వంటి ఆసక్తికర విషయాలు తెలుసుకున్నాం.

అమెరికాలోని నెవాడా స్టేట్ పేరు ఎత్తగానే ఆ దేశ ప్రజలకు బంగారమే గుర్తొస్తుంది.ఎందుకంటే నెవాడా స్టేట్ కేవలం అమెరికాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక బంగారాన్ని ఉత్పత్తి చేస్తున్న అతి పెద్ద బంగారు గనిని కలిగి ఉంది.

ప్రపంచదేశాలన్నీ ఈ గని నుంచే బంగారాన్ని దిగుమతి చేసుకుంటాయి.ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.ఈ నెవాడ గని నుంచి ప్రతీ ఏటా లక్షల కిలోల బంగారం ప్రొడ్యూస్ అవుతుంటుంది.ఉత్పత్తికి తగ్గట్టుగానే ఇది లక్షల కోట్ల సంపదను సొంతం చేసుకుంటుంది.

Telugu Biggest Gold, Gold, Kilos, Lakhs, Latest-Latest News - Telugu

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ డేటా ‘స్టాటిస్టా’ ప్రకారం, నెవాడా బంగారం గనిలో ప్రతీయేటా లక్షా 70 వేల కిలోల వరకు బంగారం తవ్వి వెలికి తీస్తున్నారు.తరువాత రూ.600 కోట్ల విలువున్న గోల్డ్ ను ఎగుమతి చేస్తుంటారట.1835 నుంచి 2017 వరకు నెవాడాలో 20,59,31,000 ట్రాయ్ ఔన్సుల బంగారం ఉత్పత్తి అయ్యిందట.ఒకే ఒక్క గని నుంచి ఈ స్థాయిలో బంగారం ఉత్పత్తి కావడం నిశ్చయంగా ఆశ్చర్యకరంగా ఉంది కదూ!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube