పూర్వ కాలం నుండి మన శాస్త్రాల్లో ఆవునెయ్యి గురించి గొప్పగా చెప్పారు.అగ్ని హోత్రం చేసే సమయంలో,యజ్ఞాలు,యాగాలు చేసే సమయంలో ఆవునెయ్యిని వాడుతారు.
ఈ విధంగా ఆవునెయ్యిని వాడటం వలన వాతావరణానికి చాలా సహాయపడుతుంది.
ఆవునెయ్యిని హోమాల్లో వాడినప్పుడు నెయ్యి వాయు రూపంలో ఏడు కిలోమీటర్ల ఎత్తుకు పోయి వాతావరణ కాలుష్యాన్ని తొలగించి, నీటి రేణువులను దగ్గరకు చేర్చి వర్షం రావటానికి సహాయపడుతుంది.
యజ్ఞాలు చేసినప్పుడు వేసే పదార్ధాల అన్నింటిలో ఆవునెయ్యి బాగా ప్రశస్తం కలిగి ఉంది.ఆవునెయ్యిని మంటలో వేసినప్పుడు వచ్చే ప్రభావం కారణంగా వాతావరణంలో రేడియేషన్ ప్రభావం తగ్గుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.