కార్తీకమాసంలో ఉసిరి కాయ ప్రాముఖ్యత తెలుసా?

కార్తీక మాసం అంటే నిత్య దీపారాధన, ప్రత్యేక పూజలు, తులసి పూజ, కార్తీక వనభోజనాలు, కార్తీక స్నానం వంటి వాటికి ఎంతో ప్రసిద్ధి.ఇదే కాకుండా ఈ కార్తీకమాసం అంటే ఆ పరమ శివుడికి ఎంతో ప్రీతికరమైన నెల.

 Do You Know The Importance Of Amla In Kartikam, Amla, Karthika Masam, Importance-TeluguStop.com

ఈ నెలలో ఆ పరమశివుడు ప్రత్యేకమైన అభిషేకాలను పూజలను అందుకుంటాడు.అయితే వీటన్నిటితోపాటు కార్తీకమాసంలో ఉసిరి చెట్టుకు ఉసిరికాయలు కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది.

కార్తీక మాసంలో ఉసిరి చెట్టును ఎందుకు పూజిస్తారు ఇక్కడ తెలుసుకుందాం….

పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు క్షీరసాగర మధనం చేస్తున్నప్పుడు సముద్రగర్భం నుంచి అమృతం ఉద్భవిస్తుంది.

ఈ అమృతం కోసం దేవతలు, దానవులు పోటీ పడుతుండగా వీరిమధ్య జరిగిన పెనుగులాటలో అమృతం కొన్ని చుక్కలు నేలపై పడ్డాయని క్రమంగా ఆ అమృత చుక్కలే ఉసిరి చెట్టు గా మారాయని పురాణాలు చెబుతున్నాయి.అందువల్ల ఉసిరి చెట్టుకు కార్తీక మాసంలో ఎంతో ప్రాముఖ్యతనిచ్చి పూజలను నిర్వహిస్తారు.

కార్తీకమాసంలో ఉసిరికాయ మీద దీపారాధన చేయడం, క్షీరాబ్ది ద్వాదశినాడు తులసి చెట్టుతో పాటుగా ఉసిరి చెట్టును కూడా పూజి స్తారు.కార్తీక సోమవారం భోజనం చేయడం ద్వారా సకల వ్యాధులు తొలగిపోయి ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారని ప్రజలు విశ్వసిస్తారు.

మన ఆరోగ్యానికి పర్యావరణానికి మేలు చేసే వృక్షాలను దేవతా వృక్షాలు గా భావించి వాటిని పూజిస్తారని మన పురాణాలు చెబుతున్నాయి.

అందుకోసమే అత్యంత విశిష్టమైన తులసి మొక్కతో పాటు ఉసిరి చెట్టుకు కూడా కార్తీక మాసంలో విశేష పూజలను అందుకుంటాయి.

అందుకోసమే కార్తీకమాసంలో క్షీరాబ్ది ద్వాదశినాడు `ధాత్రి సహిత లక్ష్మీనారాయణస్వామినే నమః` అంటూ ఆ విష్ణు భగవానుడిని ప్రార్థిస్తారు.ఉసిరి చెట్టును సాక్షాత్తు ఆ విష్ణు స్వరూపంగా భావించి హిందువులు ప్రత్యేక పూజలను నిర్వహిస్తారని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube