భీమ్లా నాయక్ లో రానా భార్యగా నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా?

Do You Know The Heroine Who Played Rana Wife In Bhimla Nayak

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న వారిలో రానా ఒకరు.బల్లాల దేవుడి పాత్రలో నటించిన రానా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు.

 Do You Know The Heroine Who Played Rana Wife In Bhimla Nayak-TeluguStop.com

బాహుబలి తర్వాత వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ఇతను ప్రస్తుతం సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి భీమ్లా నాయక్ చిత్రంలో నటిస్తున్నాడు.ఈ సినిమాలో రానా డానియల్ శేఖర్ పాత్రలో కనిపించనున్నారు.

మలయాళం సూపర్ హిట్ చిత్రమైన అయ్యపనుమ్ కోషియుమ్‘ చిత్రానికి రీమేక్ చిత్రంగా భీమ్లా నాయక్ సినిమా తెరకెక్కుతోంది.ఈ చిత్రానికి సాగర్ కే దర్శకత్వం వహిస్తున్నారు.టైటిల్ రోల్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మన ముందుకు రానున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యమీనన్ నటిస్తున్నారు.

 Do You Know The Heroine Who Played Rana Wife In Bhimla Nayak-భీమ్లా నాయక్ లో రానా భార్యగా నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలాగే రానా సరసన మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ నటిస్తున్నారు.

Telugu Bhimla Nayak, Pawan Kalyan, Rana, Samyuktha Menon, Tollywood-Movie

ముందుగా ఈ సినిమాలో రానా సరసన నటించడం కోసం ఐశ్వర్య రాజేష్ ఎంపికయ్యారు.ఈమె కొన్ని రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొని అనంతరం సినిమా నుంచి కొన్ని కారణాల వల్ల ఆమె తప్పుకున్నారు.ఈ క్రమంలోనే ఐశ్వర్య రాజేష్ స్థానంలో కి మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ వచ్చారు.

సంయుక్త మీనన్ 2016 లో పాప్ కార్న్ అనే సినిమా ద్వారా వెండితెర అరంగేట్రం చేశారు.ఇలా ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈమె పలు మలయాళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే ఈమెకు తమిళంలో కూడా అవకాశాలు రావడంతో ఒకటి రెండు చిత్రాలలో నటించారు.అయితే ఈ సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో తిరిగి ఈమె మాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లారు.

ఇలా మాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా గడుపుతున్న ఈమెకు ఇలా తెలుగులో నటించే అవకాశం రావడంతో వెంటనే ఈ సినిమాకి ఒప్పుకున్నారు.మరి ఈమె తెలుగు ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తారో తెలియాల్సి ఉంది.

Telugu Bhimla Nayak, Pawan Kalyan, Rana, Samyuktha Menon, Tollywood-Movie

ఇక సినిమా విషయానికి వస్తే దాదాపు షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్యాచ్ వర్క్ షూటింగ్ పనులను జరుపుకుంటోంది.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఎన్నో పోస్టర్లు, టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుని సినిమాపై అంచనాలు పెంచాయి.తాజాగా ఈ సినిమా నుంచి నటి సంయుక్త మీనన్ కి సంబంధించిన అడవి తల్లి మాట అనే ఈ పాటను విడుదల చేశారు.ఇక ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి నెలలో సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది.

ఇక ఈ సినిమా కోసం అటు పవన్ అభిమానులు, రానా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

#Rana #Bhimla Nayak #Samyuktha Menon #Pawan Kalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube