పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా గొప్పతనం తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే..!  

Do You Know The Greatness of Pawan Kalyan Third Wife Anna Lezhneva, Pawan Kalyan Third Wife Anna Lezhneva, Anna Lezhneva, Indian Tradition,Russian, Mega Family - Telugu Anna Lezhneva, Do You Know The Greatness Of Pawan Kalyan Third Wife Anna Lezhneva, Indian Tradition, Mega Family, Pawan Kalyan, Pawan Kalyan Third Wife Anna Lezhneva, Russian

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుత భార్య అన్నా లెజెనోవా రష్యా దేశస్థురాలని మనందరికీ తెలిసిందే.పవన్, అన్నా దంపతులకు కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్, కుమార్తె పొలెనా అంజనా ఉన్నారు.

TeluguStop.com - Do You Know The Greatness Of Pawan Kalyan Third Wife Anna Lezhneva

అయితే ఒక ఫారన్ దేశం లో పుట్టి పెరిగిన అన్నా లెజెనోవా ఎలాంటి వారో, మెగా కుటుంబంతో ఎలా నడుచుకుంటారో ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం.పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజెనోవా గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది.

ఎందుకంటే ఆమె ఎక్కువగా బాహ్యప్రపంచంతో ఇంటరాక్ట్ కారు.ఆమె కేవలం తన బంధుమిత్రుల తోనే మాట్లాడతారు.హైస్కూల్ గ్రాడ్యుయేషన్ మాత్రమే పూర్తి చేసిన అన్నా లెజెనోవా ఆ తర్వాత మోడలింగ్ రంగంలో అడుగుపెట్టారు.2011 సంవత్సరంలో తీన్మార్ సినిమా చిత్రీకరణ సమయంలో ఆమె పవన్ కళ్యాణ్ ని మొదటిసారిగా కలిశారు.అయితే ఆ సమయంలోనే పవన్, అన్నా లెజెనోవా మధ్య ప్రేమ పుట్టింది.వీళ్ళిద్దరూ కొన్నేళ్ల పాటు డేటింగ్ కూడా చేసారు.తరువాత పవన్ తన 2వ భార్య అయిన రేణుదేశాయ్ కి విడాకులు ఇచ్చి.2013 సెప్టెంబర్ 30న ఎర్రగడ్డ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో అన్నా లెజెనోవా ని పెళ్లి చేసుకున్నారు.ఆ క్షణం నుంచి అన్నా లెజెనోవా రష్యా సంప్రదాయాన్ని పూర్తిగా వీడి భారతీయ మహిళ గా మారిపోయారు.

TeluguStop.com - పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా గొప్పతనం తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

పవన్ కళ్యాణ్ లాగా ఆమె కూడా కాటన్ వస్త్రాలను ధరిస్తూ.చాలా సాదాసీదా జీవితాన్ని గడుపుతూ అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నారు.పెళ్లయిన కొత్తలో అన్నా లెజెనోవా తన భర్త పవన్ తో కలిసి డిన్నర్ కి వెళ్లే వారు కానీ ఎప్పుడూ కూడా పబ్లిక్ గా ఏ ఈవెంట్ కి వెళ్లిన సందర్భాలు లేవు.

కానీ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పెళ్లి కి అన్నా లెజెనోవా సాంప్రదాయమైన భారతీయ వస్త్రధారణ లో కనిపించి షాకిచ్చారు.చీరకట్టు, నుదుట బొట్టు తో శ్రీజ పెళ్లి లో అన్నా లెజెనోవా చాలా చురుగ్గా పాల్గొని మెగా కుటుంబంలో ఎలా కలిసి పోతున్నారో చెప్పకనే చెప్పారు.

భారతీయ సంప్రదాయాల పట్ల పెద్దగా అవగాహన లేనప్పటికీ అప్పట్లో అన్నా లెజెనోవా పవన్ కి హారతి పడుతూ, వీర తిలకం దిద్దుతూ, పవన్ కారు కి దిష్టితీసి కొబ్బరికాయ కొడుతూ వావ్ అనిపించారు.ఆ తర్వాత కూడా భారతీయ సాంప్రదాయం ఉట్టి పడేలా ఆమె నిండు వస్త్రాలతో పబ్లిక్ ఈవెంట్స్ లో కనిపించారు.పవన్ పెద్ద సెలబ్రిటీ అయినా ఆమె ఇటువంటి ప్రగల్బాలకు పోరు.తన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అప్లోడ్ చేసిన సందర్భాలు కూడా లేవు.దీన్ని బట్టి చూస్తుంటే ఆమె మిగతా ప్రపంచంతో సంబంధం లేకుండా కేవలం పవన్ కి మాత్రమే సేవ చేస్తూ తన జీవితాన్ని గడిపేస్తున్నారు అని తెలుస్తోంది.నాగబాబు కూడా రేణుదేశాయ్ కంటే అన్నా లెజెనోవా నే తమ కుటుంబంలో బాగా కలిసిపోతున్నారని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

అన్నా లెజెనోవా అంటే మెగా కుటుంబంలో అందరికీ ఇష్టమేనట.అందుకు కారణం అన్నా మెగా కుటుంబ సభ్యులతో వ్యవహరించే తీరే అని చెప్పుకోవచ్చు.

అన్నా లెజెనోవా పవన్ ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించారు కాబట్టే ఆమె తన రష్యా జీవితాన్ని మర్చిపోయారు.పవన్ మరియు తన పిల్లలతో ఆమె సంతోషంగా జీవిస్తున్నారు.

క్రిస్టమస్ సందర్భంగా ఆమె తన పుట్టింటికి వెళతారు కానీ సంవత్సరం మొత్తంలో పవన్ కళ్యాణ్ తోనే ఉంటారు.

#Mega Family #DoYou #PawanKalyan #Anna Lezhneva #Pawan Kalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు