మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ‘ఓకే’ అంటారు కదా..‘ఓకే’కు పూర్తి అర్థం తెలుసా?

మీరు ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు లేదా మెసేజ్ చేసే సందర్భంలో ‘ఓకే’ అనే పదాన్ని తరచూ వాడేవుంటారు.మరి దాని అర్థం ఏమిటో మీకు తెలుసా? ఈ రెండు అక్షరాల పదాన్ని ఉపయోగించడం ద్వారా మన అంగీకారం తెలియజేస్తుంటాం.ఇది సాధారణ వ్యావహారిక పదంగా మారిపోయింది.అయితే చాలా మందికి ‘ఓకే’ వెనుకనున్న కథ, దాని అర్థం గురించి పూర్తిగా తెలియదు.అందుకే ఇప్పుడు ‘ఓకే’కి సంబంధించిన సంగతులు తెలుసుకుందాం.ఈ పదం అంగీకారం, ఒప్పందం, ఆమోదం వంటి అనేక సందర్భాల్లో ఉపయోగిస్తారు.

 Do You Know The Full Meaning Of Ok Details, People English King People, Ok Meaning, Story Behind Ok, America President, Martn Van Buren, All Correct, Greek Word, 19th Century, Charles Gordon Green-TeluguStop.com

నిజానికి ఇది గ్రీకు పదం, దీని అర్థం ‘అంతా బాగుంది’ అని అర్థం.

ఈ పదం 182 సంవత్సరాల క్రితం పుట్టింది.ఈ పదం వినియోగం అమెరికన్ జర్నలిస్ట్ చార్లెస్ గోర్డాన్ గ్రీన్ కార్యాలయంతో ప్రారంభమైంది.1839 సంవత్సరంలో రచయితలు ఈ పదాన్ని వినియోగించారు.1840లో అమెరికా అధ్యక్షుడు మార్టిన్ వాన్ బ్యూరెన్ ఎన్నికల ప్రచారంలో ‘ఓకే’ అనే పదాన్ని ఉపయోగించినప్పుడు అది ప్రపంచవ్యాప్తంగా ప్రజాదారణ పొందింది.న్యూయార్క్‌లోని కిండర్‌హుక్‌లో జన్మించిన వాన్ బ్యూరెన్‌కు ‘ఓల్డ్ కిండర్‌హుక్’ అనే ముద్దుపేరు ఉంది.

 Do You Know The Full Meaning Of OK Details, People English King People, Ok Meaning, Story Behind Ok, America President, Martn Van Buren, All Correct, Greek Word, 19th Century, Charles Gordon Green-మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ‘ఓకే’ అంటారు కదా..‘ఓకే’కు పూర్తి అర్థం తెలుసా-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అతని మద్దతు దారులు ఎన్నికల ప్రచార సమయంలో ర్యాలీలలో ‘ఓకే’ అనే పదాన్ని ఉపయోగించారు.దేశవ్యాప్తంగా “ఓకె క్లబ్‌లు” ఏర్పాటు చేశారు.

స్థానిక అమెరికన్ ఇండియన్ తెగ నుండి ఓకే అనే పదం వచ్చిందిని కూడా చెబుతారు.ఆఫ్రికాలోని వోలోఫ్ భాష నుండి ఉద్భవించిందని కూడా అంటారు.స్మిత్సోనియన్ మ్యాగజైన్‌లోని ఒక కథనం ప్రకారం ఓకే అనే పదం 19వ శతాబ్దం ప్రారంభంలో ఉద్భవించింది.నిజానికి ‘ఆల్ కరెక్ట్’ సంక్షిప్తం చేస్తే ‘ఓసీ’ అని వస్తుందని దానిని ఆ తరువాత ‘ఓకే’గా మార్చారని అంటున్నారు.

దీని ప్రకారం చూస్తే ‘ఓకే’ను తప్పుగా పలుకుతున్నామనే వాదన కూడా వినిపిస్తుంటుంది.

History of OK Word How the Word “OK” Was Invented Meaning of OK Word

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube