జలుబుకు, కరోనా జలుబుకు తేడా ఏంటో తెలుసా?

Normal Cold Vs Covid Cold Difference, Covid Cold, Corona Symptoms, Loss Of Smell, Social Distance

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గురించి అందరికీ తెలిసిందే. కరోనా వైరస్ అంతమొందించేందుకు శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు.

 Normal Cold Vs Covid Cold Difference, Covid Cold, Corona Symptoms, Loss Of Smell-TeluguStop.com

దీనివల్ల కొత్త కొత్త విషయాలు వెల్లడవుతున్నాయి.ప్రస్తుతం మరో అధ్యయనం లో మామూలు జలుబుకు, కరోనా జలుబుకు మధ్య తేడా గురించి తెలిపారు.

మనం మాట్లాడేటప్పుడు నోటి నుండి వచ్చే లాలాజల బిందువుల ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తుంది.లాలాజల బిందువులు గాలిలో ప్రయాణించేటప్పుడు అది తమ జీవితకాలాన్ని పెంచుకుంటుంది అని పరిశోధనలో తేలింది.

వాటి జీవిత కాలం దాదాపు 23 రెట్లు ఎక్కువగా ఉంటుంది.కాబట్టి వైరస్ వ్యాప్తి ఇతరులతో మాట్లాడుట, వారి దగ్గర ఉన్నప్పుడు తుమ్మడం, దగ్గడం ద్వారా వస్తుంది.

కాబట్టి మనిషికి, మనిషికి మధ్య కనీసం మూడు అడుగుల దూరమైనా పాటించాలి.అయితే మాట్లాడిన తుమ్మినా, దగ్గినా లాలాజల బిందువుల వైరస్ 70% బయటనే పడిపోతుంది.

మామూలుగా మనిషి శ్వాసలో బిందువుల పరిమాణం ఒకటి నుండి 1000 మైక్రాన్లు ఉంటుంది.మనిషి ఊపిరి వదిలినప్పుడు వైరస్ లో ఉండే బిందువులు 50 నుండి 100 మైక్రాన్ల డయామీటర్ లో ఉంటాయని నిపుణులు తెలిపారు.

గాలిలో తేమ ఎక్కువగా వుంటే కరోనా వైరస్ ఎక్కువ సమయం గడుపుతుంది.కాబట్టి సామాజిక దూరం పాటించాలని నిపుణులు చెప్తున్నారు.వైరస్ లాలాజల బిందువుల నుండి మనం కాపాడుకోవడానికి ఒక్కటే మార్గం మాస్కులను ధరించడం.పలుచని మాస్క్ లను కాకుండా ఒత్తుగా ఉండే వస్త్రాలతో చేసిన మాస్కులు ధరించడం వల్ల వైరస్ ను దరి చేరకుండా కొంతవరకు కాపాడుకోగలం.

ఏదైనా స్థానంలో చేతులను తగ్గించకుండా చేతులకు గ్లౌజులు వేసుకోవడం మంచిది.అయితే జలుబు చేసినపుడు చాలావరకు వాసనలు తెలియవు.ఎందుకంటే జలుబు వల్ల ముక్కులు మూసుకుపోవడంతో గాలి పీల్చుకోవడం, వాసన పీల్చుకోవడం కష్టమవుతుంది.కరోనా సోకితే కూడా వాసనను కోల్పోతాం.

జలుబుకు, కరోనా జలుబుకు మధ్య తేడా ఉందని నిపుణులు తెలుపుతున్నారు.

కరోనా వైరస్ మెదడును ప్రభావితం చేయడం వల్ల… ముక్కు వాసనను కోల్పోయి, ముక్కు మూసుకోకుండా ఉంటుంది.

ముక్కు కారడం కూడా జరగదు.జలుబు, కోవిడ్ రెండు గుణాలు ఒకేలా కలిగి ఉండగా చాలామంది భయపడిపోతారు.

కరోనా సోకితే ముందుగా వాసన కోల్పోతారు.చేదు, తీపి రుచులను కూడా కోల్పోతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube